డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

ఎయిర్‌ ఇండియా సేవలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రయాణికులను మోసం చేయడమేనని అభిప్రాయపడ్డారు.

New Update
air india, Shivraj Singh Chouhan

ఎయిర్‌ ఇండియా సేవలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను AI436 కి టికెట్ తీసుకున్నానని, అక్కడ తనకు సీటు నంబర్ 8C కేటాయించబడిందని ... లోపలికి వెళ్లి చూశాక ఆ సీటు విరిగిపోయి ఉందన్నారు. దీని వల్ల తనకు చాలా అసౌకర్యం కలిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఇది ప్రయాణికులను మోసం చేయడం కిందికి వస్తుందని చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా యాజమాన్యం దీనిపై ఏదైనా దిద్దుబాటు చర్య తీసుకుంటుందా లేదా ప్రయాణీకుల నిస్సహాయతను ఇలాగే ఉపయోగించుకుంటూనే ఉంటుందా అని ప్రశ్నించారు.  

అది కేవలం అపోహ మాత్రమే

నా తోటి ప్రయాణీకులు నా సీటులో వారు కూర్చుని వారి సీటు తనకు ఇస్తామని అన్నారు కానీ నా కోసం వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకున్నాని శివరాజ్ సింగ్ చౌహాన్  చెప్పారు. విరిగిన సీటులో కూర్చుని తన ప్రయాణాన్ని పూర్తి చేశానని తెలిపారు. టాటా యాజమాన్యం ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత సేవలు మరింత మెరుగుపడి ఉంటుందని భావించానని కానీ అది కేవలం అపోహ మాత్రమేనని అర్థం అయిందన్నారు.  భవిష్యత్తులో ఏ ప్రయాణీకుడికి కూడా ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఎయిర్ ఇండియా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  

అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఎయిర్‌లైన్ తన అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ నుండి స్పందిస్తూ..  “డియర్ సర్, మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము” అని రాసింది. మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.  

Advertisment
Advertisment
Advertisment