/rtv/media/media_files/2024/11/01/RhrhB0QedVfdhGhx2nuK.jpg)
ఆగంతకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కాల్స్, ట్వీట్స్ చేసి బెదిరిస్తున్నారు. ప్రధాన ఎయిర్ పోర్టులైన హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమానాలకు కేవలం నెల రోజుల్లోనే అత్యధికంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఓ వైపు ప్రయాణికులకు, మరోవైపు అధికారులకు దడ పుడుతోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
నెల రోజుల్లో 65 బాంబు బెదిరింపులు
కాగా గత నెల అంటే అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు దాదాపు 65 బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అందులో శంషాబాద్ కు బుధవారం 3, మంగళవారం 6 బెదిరింపులు రాగా.. అక్టోబర్ 22న ఏకంగా 35 వచ్చాయి. అలాగే అక్టోబర్ 28,29న విశాఖలోని ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్స్ వచ్చాయి. ఈ మేరకు చెన్నై- విశాఖ, బెంగళూరు - విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఇవన్నీ ఉత్తిత్తివే అని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. బెదిరింపు దారులు కేవలం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నా.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అంత తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇందులో భగంగానే తనిఖీలతో విమానాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు సైతం చాలా ఇబ్బందులు పడుతుండటాన్ని పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.
Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!
ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికులు
కాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సంవత్సరానికి 2.5 కోట్ల మంది ప్రయాణాలు జరుగుతున్నాయి. అందులో దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రయాణిస్తున్నారు. అంటే రోజుకు సగటున లక్షమంది ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో 450 నుంచి 500 సర్వీసులు నడుస్తున్నాయి. అంతేకాకుండా ప్రయాణికులే కాకుండా టూరిస్టుల రూపంలో 4 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్లనే బాంబు బెదిరింపులు ఉత్తిత్తివే అని భావించినా.. ప్రయాణికుల సేఫ్టీ విషయంలో భద్రతా అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదు.
సంస్థలపై భారం
Also Read: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !
అయితే ఇలా వరుసగా బాంబు బెదిరింపులు రావటం, దీంతో కట్టుదిట్టంగా తనిఖీలు చేయటంతో ప్రయాణికులు గంటల కొద్ది వెయిట్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల విమానయాన సంస్థలపై భారీ భారం పడుతోంది. ఎందుకంటే గంటకు మించి ఆలస్యమైతే ప్రయాణికులకు ఫుడ్ ఫెసిలిటీ కల్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో గంటలకొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చినపుడు విశ్రాంతి తీసుకోవడానికి వందల మందికి హోటల్ రూమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా విమానాలు లేట్ అయితే మొత్తం ప్రయాణాన్నే క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పైలట్లు, ఎయిర్ హూస్టెస్, స్టాఫ్ కు బస సైతం ఏర్పాటు చేయాలి. ఇలా వీటన్నింటిని చూసుకుంటే విమానయాన సంస్థలపై భారం ఏ రేంజ్ లో పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి
ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం
రోజుకు పదుల సంఖ్యలో వస్తున్న బాంబు బెదిరింపులు ఒత్తిత్తివే అని పోలీసులు గుర్తించారు. కానీ వాటిని అంత తేలిగ్గా తీసుకోకుడదని భావిస్తున్నారు. ప్రయాణికుల సేఫ్టీ కోసం వందల మంది సామగ్రిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నారు. మరోవైపు ఖతిస్థానీ పేరుతో వేర్పాటువాదల బెదిరింపుల దృష్ట్యా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీసులు ఇప్పటివరకు దాదాపు 8 కేసులు నమోదు చేశారు.
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..