Tamil Nadu Vote Counting: 234 సీట్లు.. 62 కౌంటింగ్ కేంద్రాలు.. 3.6 లక్షల సిబ్బంది.. TN కౌంటింగ్ హైలెట్స్ ఇవే!

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.

author-image
By B Aravind
New Update
Tamil Nadu Vote Counting

Tamil Nadu Vote Counting

Tamil Nadu Vote Counting: తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి EVM లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ నేతల భవితవ్యం రేపు తేలనుంది.

 ముఖ్యంగా సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూర్, మాజీ సీఎం పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడి, ఉదయనిధి స్టాలిన్ బరిలో ఉన్న చెపాక్-తిరువల్లికేని,  ఓ. పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న బోడినాయకనూర్ లాంటి స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ కీలక నియోజకవర్గాలపై ఫలితాలు ఎటువైపు వస్తాయో అనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 

Also Read: ఎన్నికల ఫలితాలకు ముందు పినరయ్ విజయన్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బయోలో మార్పులు

భద్రతా పరంగా చూసుకుంటే ఎన్నికల కమిషన్ (EC) కూడా అత్యంత కఠిన చర్యలు చేపట్టింది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెంకాసి లాంటి పలు సమస్యాత్మక జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. దాదాపు 3.6 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 

Also Read: బ్రిజ్‌భూషణ్ అడ్డాలో రెజ్లింగ్ పోటీ.. 'నాకేమైన జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'.. వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు

సాధారణంగా తమిళనాడులో DMK, AIADMK కూటముల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. తమిళనాడులో ఈసారి ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రంగప్రవేశం చేశారు. దీంతో ఈ పోరు త్రిముఖంగా మారింది. ఓట్ల చీలిక వల్ల ఎవరికి లాభం ఉంటుందో ? ఎవరికి నష్టం ఉంటుందో అనేది సోమవారం మధ్యాహ్నానికల్లా స్పష్టత వస్తుంది. అయితే మైక్రో అబ్జర్వర్ల నిఘాలో, పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే ఈసారి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని సర్వేలు టీవీకే విజయ్ కింగ్ మేకర్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించాయి. మరి తమిళనాడులో ఈసారి అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికాసేపు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు