/rtv/media/media_files/2026/05/04/rg-kar-2026-05-04-10-41-58.jpg)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పానిహటి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోల్‌కతా ఆర్.జి. కర్ వైద్య కళాశాల హత్యాచార ఘటన బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్, ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసి అనూహ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పానిహటి అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ అభ్యర్థి రత్న దేబ్నాథ్ తన సమీప ప్రత్యర్థి (తృణమూల్ కాంగ్రెస్)పై సుమారు 3,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్.జి. కర్ ఘటన తర్వాత బెంగాల్ వ్యాప్తంగా మహిళా భద్రతపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రత్న దేబ్నాథ్ ఎన్నికల బరిలోకి దిగడం, అందులోనూ ఆధిక్యంలో ఉండటం అధికార టీఎంసీకి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పానిహటిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడమే కాకుండా, బాధితురాలి తల్లికి సానుభూతి పవనాలు తోడైనట్లు స్పష్టమవుతోంది. 2024లో ఆర్.జి. కర్ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కుమార్తెకు న్యాయం జరగాలనే పోరాటంతో పాటు, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం తాను రాజకీయంలోకి వస్తున్నట్లు రత్న దేబ్నాథ్ ప్రకటించారు. బీజేపీ ఆమెకు పానిహటి టికెట్ కేటాయించింది.
Follow Us