Republic day: రిపబ్లిక్‌ డే కవాతులో అదరగొట్టిన ‘నారీశక్తి’..

ఈసారి జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో నారీశక్తి, వికసిత్ భారత్ అంశాలు ఆకట్టుకున్నాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంగీత వాయిద్యాలతో పరేడ్‌ను ప్రారంభించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Naari shakthi at Republic Day Parade

Naari shakthi at Republic Day Parade

న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈసారి జరిగిన వేడుకల్లో నారీశక్తి, వికసిత్ భారత్ అంశాలు ఆకట్టుకున్నాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంగీత వాయిద్యాలతో పరేడ్‌ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ అయిన త్రివిధ దళాల్లో నారీశక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ.. మహిళా అధికారులు లెఫ్టినెంట్‌ కర్నల్ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్‌ మణి అగర్వాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.     

Also Read: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!

ఇక డీఆర్‌డీవో నిర్వహించిన కవాతుకు మహిళా సైంటిస్ట్ సునీతా జెనా నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలపరచడంలో మహిళలు అందించిన సహకారాన్ని ఈ కవాతులో చూపించారు. మరోవైపు అసిస్టెండ్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్‌ నేతృత్వంలో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం పరేడ్‌లో పాల్గొంది. అలాగే డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నాయకత్వంలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బృందం, డివిజన్ కవాతులో పాల్గొన్నాయి. సుమారుగా 15 మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై-పాస్ట్‌లో తమ ప్రతిభను చాటిచెప్పారు.   

Also Read: ఆస్తులమ్మి భార్యను చదివిస్తే.. జాబ్ వచ్చాక భర్తను వదిలేసింది.. అబ్బో చివరికి ట్విస్ట్ అదుర్స్!

 16 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. వీటిలో 26 శకటాలు మహిళా సాధికారత అంశాలను ప్రతిబింబించాయి. మణిపుర్‌లో తామర పూల కాడలలో సున్నితమైన నారలతో మహిళలు చీరలు తయారు చేస్తున్నట్లు, పడవలు నడుపుతున్నట్లు.. అలాగా హస్తకళలు, చేనేతతో పాటు పలు రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న వాటికి సంబంధించిన వాటిని పరేడ్‌లో ప్రదర్శించారు.    

Also Read: NEET UG 2025 పరీక్ష పై ఎన్టీఏ కీలక ప్రకటన.. ఇకపై ప్రశ్నాపత్రం అలాగే ఉంటుంది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు