/rtv/media/media_files/2025/02/20/pkHaKV3cKHHu95IrpE42.jpg)
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఫిబ్రవరి 20వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 : 25 గంటలకు రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ప్రమాణం చేయించారు.
भाजपा की सुषमा स्वराज, कांग्रेस की शीला दीक्षित और आप की आतिशी के बाद दिल्ली को चौथी महिला मुख्यमंत्री मिल गई है।
— Chandan Yadav (@ChandankryadavN) February 20, 2025
रेखा गुप्ता मुख्यमंत्री बन चुकी है।#RekhaGuptapic.twitter.com/4yIINH5LgE
ప్రధాని మోదీతో పాటుగా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, పలువురు సెలబ్రేటీలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్. అతిషి తరువాత రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. సీఎంగా రేఖా గుప్తా తరువాత ఆరుగురు మంత్రలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరికి ఈ రోజు శాఖలు కేటాయించే అవకాశం ఉంది.
ఆస్తులెంత,ఆప్పులెంత
రేఖా గుప్తా ఆస్తులెంత,ఆప్పులెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, రేఖా గుప్తా మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.5.3 కోట్లు కాగా అప్పులు రూ. 1.2 కోట్లు. ఈమె ఎల్‌ఎల్‌బి చదివారు. రేఖా గుప్తా దగ్గర రూ.1,48,000 నగదు ఉంది. ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 72.94 లక్షలు డిపాజిట్ ఉంది. ఆమెకు వివిధ కంపెనీలలో వాటాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఆమెకు ఎల్ఐసీలో రూ. 53 లక్షల పెట్టుబడి కూడా ఉంది.
Also Read : IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. జడేజాకు బిగ్ షాక్..!