ఆర్టీవీ ఎఫెక్ట్..నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. థర్డ్ పార్టీల ద్వారా  అక్రమంగా నిధులు మళ్లిస్తే..ఈడీ విచారణ ఎదుర్కొవాల్సిందే అంటూ హెచ్చరించింది.

author-image
By Manogna alamuru
New Update

Euro Exim Bank Scam:

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్‌పై RTV చెప్పిందే అక్షరాల నిజం అయింది. అప్పట్లో ఆర్టీవీ ప్రసారం చేసిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు వ్యవహారాల విషయంలో ఆర్బీఐ స్పందించింది. ఆర్టీవీ కథనాలను పరిగణలోకి తీసుకుని   నకిలీ విదేశీ బ్యాంక్‌ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ తరహా కుంభకోణాల విషయంలో..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. థర్డ్ పార్టీల ద్వారా  అక్రమంగా నిధులు మళ్లిస్తే..ఈడీ విచారణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. నకిలీ గ్యారంటీలు అంగీకరించడం FEMA చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ఆర్బీఐచెప్పింది. నకిలీ గ్యారంటీలపై బ్యాంకులు తమ కస్టమర్లను..అప్రమత్తం చేయాలని నొక్కి మరీ చెప్పింది ఆర్బీఐ. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు చేసే కాంట్రాక్టర్లు...వారికి సహకరించే ఐఏఎస్‌లు చట్టపరమైన చర్యలు ఎదుర్కొక తప్పదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. 

rbi

ఆర్టీవీ విజయం..

ఆర్బీఐ  సర్క్యూలర్‌తో RTV భారీ విజయం సాధించినట్టయింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు స్కామ్‌ను ఆర్టీవీనే మొదటిసారిగా బయటపెట్టింది. RTV కథనంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీచిదంబరం ఎబీఐకు లేఖ రాశారు. దాంతో పాటూ నకిలీ బ్యాంకు గ్యారంటీలపై ఈడీతో దర్యాప్తు చేయించాలని గతంలోనే ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ కొత్త సర్క్యూలర్‌‌ను విడుదల చేసింది.

ఆర్టీవీ బయటపెట్టిన ఆధారాలు..

ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలకు సంబంధించి అన్ని ఆధారాలను సంపాదించింది ఆర్టీవీ. ఆ బ్యాంక్ ప్రతినిధి తాము ఫేక్ గ్యారెంటీలను ఎలా ఇస్తారో వివరించిన ఆడియో సైతం ఆర్టీవీ వద్ద ఉంది. ఈ ఫేక్‌ గ్యారెంటీ స్కామ్‌లో SBI పాత్రను బహిర్గతం చేసే ఫోన్‌ వివరాలు కూడా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ప్రజల ముందు ఉంచింది ఆర్టీవీ. ఈ వార్తలకు వివరణ ఇవ్వకుండా పరువు నష్టం దావా వేసి.. నవ్వుల పాలైంది యూరో ఎగ్జిమ్ బ్యాంక్. తమ దందా బయటపడే సరికి ఉక్కిరిబిక్కిరైన ఆ బ్యాంక్ పరువు నష్టం దావాతో తనపై ఆరోపణలను కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇన్నాళ్లు ఆ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలతో ప్రజల సంపదను దోచుకున్న కాంట్రాక్టర్లు సహకరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారానే లబ్ధి పొందింది. ఈ కంపెనీ 432 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ ఫ్రా లిమిటెడ్‌కు ఇచ్చింది. మహారాష్ట్రలోని MMRDA ప్రాజెక్టులో భాగంగా థానే నుంచి బోరివలి వరకు సొరంగం నిర్మించడానికి గ్యారంటీ ఇచ్చారు. ప్రతీ ప్రాజెక్టులో బ్యాంక్‌ గ్యారంటీగా 10 శాతం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంకు గ్యారంటీలతో తమ ఖాతాలో వేసుకున్నారన్న విషయాలు ఆర్టీవీ ఇన్‌వెస్టిగేసన్‌లో తేలాయి.

ఏపీ విద్యుత్ శాఖలో కొందరు అవినీతి తిమింగళాలు ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశాయన్న ఆరోపణలుఉన్నాయి. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి తదితరుల కంపెనీలు కూడా ఉన్నాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించింది. అటు కర్ణాటక డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు స్వాగతం పలికాయి. మరోవైపు మహారాష్ట్రలో MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా కుంభకోణానికి లైన్ క్లీయర్ చేశాయి.

Also Read: J&K: జమ్మూ–కాశ్మీర్ కొత్త సీఎం ఒమర్ అబ్దుల్లా..సక్సెస్ స్టోరీ

Advertisment
Advertisment
తాజా కథనాలు