ఈ ఒక్క వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. టాటా జీవితం మొత్తాన్ని ఇక్కడ చూసేయండి!

రతన్ టాటా మరణం యావత్‌ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ క్రమంలో రతన్ టాటా చిన్నప్పటి నుంచి ఆయన దేశంలోనే గొప్ప వ్యాపార వేత్తగా ఎదిగిన తీరును చూపిస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

New Update
ratan tata 00

ratan tata

Ratan Tata: రతన్ టాటా మరణం యావత్‌ దేశాన్ని కలిచివేస్తోంది. దీంతో టాటా జీవితానికి సంబంధించిన పలు  వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రతన్ టాటా చిన్నప్పటి నుంచి ఆయన దేశంలోనే గొప్ప వ్యాపార వేత్తగా ఎదిగిన తీరును చూపిస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. 

రతన్ టాటా లైఫ్ 

రతన్ టాటా చిన్నతనంలోనే చాలా కష్టతరమైన జీవితాన్ని చూసారు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే టాటా తల్లిదండ్రులు విడిపోయారు.  ఆ తర్వాత ఆయన తల్లి మరో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో టాటాను స్కూల్ లోని తోటి వారు ఎగతాళి చేసేవారట. అప్పట్లో అది ఆయనను చాలా బాధపెట్టిందట. ఈ క్రమంలోనే పెరిగి  పెద్దైన రతన్ టాటా ఇంజనీర్ కావాలనే తన తండ్రి కోరికకు వ్యతిరేకంగా.. అమెరికాలో  ఆర్కిటెక్చర్ చేశారు.

అమెరికాలో చదువుకునే రోజుల్లో టాటా  ఒక అమ్మాయిని ప్రేమించారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ సడెన్ గా ఆయన అమ్మమ్మ అనారోగ్యం కారణంగా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండో-చైనా యుద్ధం కారణంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు వెళ్లనివ్వకపోవడంతో వాళ్ళ బంధం అక్కడితో ముగిసిపోయింది. ఇక  ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం తీసుకున్న టాటా.. తన వాగ్దానానికి కట్టుబడి  జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారు. 

 రతన్ టాటా  చిన్నవయసులోనే  'టాటా'  చైర్మన్ అయ్యాడు. కానీ చాలా విమర్శను ఎదుర్కొన్నారు. ఒక ఫ్రెషర్ చైర్మన్ గా ఎంపిక చేయడాన్ని చాలా మంది  తప్పు పట్టారు. 1998లో సేల్స్ పడిపోయిన  కారణంగా టాటా మోటార్స్.. కార్ల (ఇండికా)  వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది.  అయితే  ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉండడంతో టాటా..  అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కంపెనీకి  వెళ్ళి, అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు.. టాటాను  ఎగతాళి గా మాట్లాడి పంపించారు.

కానీ కొన్నాళ్ళకు అదే  ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు ఇండియా వచ్చి.. తమ లగ్జరీ కార్లు అయిన "జాగ్వార్", "లాండ్ రోవర్" కొనమని టాటాను అడిగారు.  జీవితంలో స్వయం కృషితో కష్టపడి ఎదిగిన  రతన్ టాటా  "ముందు నిర్ణయాలు తీసుకోండి.. తర్వాత  వాటిని సరిదిద్దండి"అని చెప్పారు.  కోవిడ్ సమయంలో రతన్ టాటా దేశం కోసం  2500 కోట్ల విరాళం అందించారు.

Also Read: బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్.. ఓటీటీలో హిట్ అవుతుందా? ఆ సినిమా ఏంటో తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు