Raghav Chadha Net Worth: CA నుంచి రాజ్యసభ దాకా: ఆప్ ఎంపీ ఆస్తుల లెక్క ఎంతంటే?

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చడ్డాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ పదవి నుండి తొలగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ నాయకత్వంతో విభేదాలు తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం, ఆయనకు భవిష్యత్తులో పార్టీ కోటాలో మాట్లాడే అవకాశం

New Update
raghav chedda

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చడ్డాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ పదవి నుండి తొలగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ నాయకత్వంతో విభేదాలు తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం, ఆయనకు భవిష్యత్తులో పార్టీ కోటాలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కూడా రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాఘవ్ చడ్డా నేపథ్యం,  ఆయన భార్య, ప్రముఖ నటి పరిణీతి చోప్రా ఆస్తుల వివరాలపై నెటిజన్లు ఎక్కవగా సెర్చ్ చేస్తున్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ లో  అత్యంత ప్రభావవంతమైన యువ నేతగా ఎదిగిన రాఘవ్ చడ్డా ప్రస్థానం ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా మొదలై, దేశరాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు.  రాఘవ్ చడ్డా 1988 నవంబర్ 11న న్యూఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ఢిల్లీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన డెలాయిట్, గ్రాంట్ థార్న్టన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత అకౌంటింగ్ సంస్థల్లో పనిచేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుండే చడ్డా ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. 2012లో ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీలో అరవింద్ కేజ్రీవాల్ ఆయనను ప్రోత్సహించారు. అదే ఆయన మొదటి రాజకీయ బాధ్యత. అనతి కాలంలోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా మారి, టీవీ చర్చల్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించే యంగ్ ఫేస్‌గా గుర్తింపు పొందారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన తర్వాత, కేవలం 26 ఏళ్ల వయస్సులోనే ఆయనను పార్టీ జాతీయ కోశాధికారిగా నియమించారు. 

అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చడ్డా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీతో విభేదాల వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన రాజకీయ ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న రాఘవ్ చడ్డా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్ వచ్చినా స్పందించకపోవడం వల్లే పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆస్తి విలువ సుమారు రూ.50 లక్షలు 

ఇక ఆయన ఆస్తుల విషయానికి వస్తే..ఆయన వ్యక్తిగత నికర ఆస్తి విలువ సుమారు 50 లక్షల రూపాయలు. ఆయనకు సుమారు 36 లక్షల రూపాయల విలువైన ఇల్లు ఉంది. ఒక మారుతి సుజుకి డిజైర్ కారు ఉంది. సుమారు 4.94 లక్షల రూపాయల విలువైన బంగారం, 6 లక్షల రూపాయల విలువైన బాండ్లు, షేర్లు ఉన్నాయి. రాఘవ్ చడ్డా కంటే ఆయన భార్య పరిణీతి చోప్రా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. 

ఆమె మొత్తం నికర ఆస్తి విలువ సుమారు 74 కోట్ల రూపాయలు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆమెకు 22 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆమె వద్ద 1.30 కోట్ల రూపాయల రేంజ్ రోవర్ వోగ్, 43.19 లక్షల ఆడి Q4,  69.27 లక్షల ఆడి Q7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆమె ఏడాదికి సుమారు 5.36 కోట్ల రూపాయల వరకు సంపాదించేవారు.
 

Advertisment
తాజా కథనాలు