/rtv/media/media_files/2025/04/06/2DB7naiJfJJXUhidWi0J.jpg)
pambana 125412
రామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పంబన్ బ్రిడ్జ్ అనే రైల్వే వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 72.5 మీటర్ల లిఫ్ట్ నిలువుగా చైన్ లింకప్ ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ కోటింగ్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంకలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు.
Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025
Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!
రామ నవమి సందర్భంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే రామసేతును వీక్షించడం గురించి ప్రధాని తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది దైవిక యాదృచ్చికమని ప్రధాని అభివర్ణించారు. పూరాణాల్లో పాతుకుపోయిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఆయన చెప్పారు. రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ.. ఈ వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2.08 కి.మీ పొడవున్న ఈ నిర్మాణంలో 99 స్పాన్‌లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ ఉన్నాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెలుతుంది. కింద నుంచి ఓడలు ప్రయాణిస్తాయి. ఓడలు వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా పైకి లేస్తోంది. ఇదే దీని స్పెషాలిటీ.