/rtv/media/media_files/2025/02/13/mn0KM8uykNq8cTrWC0VZ.webp)
Operation Kagar..
Operation Kagar : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తు్న్న ‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టులను భయపెడుతోంది. ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులు హతం కావడం మావోయిస్టుల్లో అలజడిని సృష్టిస్తోంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను తుదముట్టిస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు దండకారణ్యంలో భారీ ఎత్తున దిగిన కేంద్ర బలగాలు వరుస ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 303 మంది మావోయిస్టులు చనిపోగా, వీరిలో ఏకంగా 102 మంది మహిళలుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 2024లో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 80 మంది మహిళ మావోయిస్టులే ఉన్నారు. 2025లో ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 86 మంది మావోయిస్టులు చనిపోగా, ఇందులో 22 మంది వరకు మహిళలు ఉన్నారు.కాగా మావోయిస్టుల ఏరివేతకు కూడా లొంగిపోయిన మావోయిస్టులను వాడుకోవడం, అందులోనూ మహిళా నక్సల్స్‌ను ఈ ఆపరేషన్‌కు వాడుకోవడం సంచలనం కలిగిస్తున్నది.
ఇది కూడా చదవండి: కీమోథెరపీ వల్ల కనురెప్పలు కూడా రాలిపోతాయా?
మావోయిస్టు బాధితులే కమాండోస్
చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 2021లో బస్తర్ రీజియన్‌లో 451 మంది మహిళా కమాండోలను రిక్రూట్ చేసుకుంది. దంతెవాడ జిల్లాలో దంతేశ్వరి దేవి ఆదివాసీల ఆరాధ్య దైవం. ఆ అమ్మవారి స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదివాసీ మహిళలను ‘దంతేశ్వరి ఫైటర్స్’ పేరుతో మహిళా కమాండోస్‌ను రిక్రూట్ చేసుకుంది. వీరికి అడవులు, నదులు, వాగులు పరివాహక ప్రాంతాల్లో అన్ని కాలాల్లోనూ ఆపరేషన్స్ నిర్వహించేలా ట్రైనింగ్ ఇచ్చారు. దంతేశ్వరి ఫైటర్స్ కమాండోల గ్రూపులో 97 మంది మహిళా కమాండోస్‌ను నియమించుకున్నారు. అందులో 37 మంది లొంగిపోయిన మావోయిస్టులే ఉండటం గమనార్హం. మిగిలిన 60 మంది కూడా మావోయిస్టు ప్రాబల్య గ్రామాల్లోని బాధిత కుటుంబాల నుంచే రిక్రూట్ చేసుకున్నారు. అంటే మావోయిస్టుల వేలితో వారి కంట్లోనే పొడిచేలా ఈ నియామకం జరిగింది.
ఇది కూడా చదవండి: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
మహిళా కమాండోస్ కు ప్రత్యేక శిక్షణ
మహిళా కమాండోస్‌లో ఉన్నవారిలో చాలామందికి గతంలోనే ఆయుధాలు వినియోగించిన అనుభవం ఉండటంతో వారికి శిక్షణ ఇవ్వడం చాలా సులభమైంది. ఈ 548 మంది మహిళా కమాండోస్‌కు ట్రైనింగ్‌లో భాగంగా నిత్యం పౌష్టికాహారం అందించి అధునాతన ఆయుధాలతో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టడం, గస్తీ కాయడం వంటివి నేర్పించారు. దట్టమైన అడవుల్లో సైతం ఆపరేషన్లు చేయడంలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇక ‘బస్తర్ ఫైటర్స్’ పేరుతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) మహిళా కమాండోస్‌ను సైతం నియమించుకున్నారు. ఇందులోనూ లొంగిపోయిన మావోయిస్టులనే ఎక్కువ సంఖ్యలో రిక్రూట్ చేసుకున్నారు. దండకారణ్యంపై పట్టు ఉన్న మహిళా జవాన్లు ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
ఒకప్పుడు మావోయిస్టుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దండకారాణ్యం పై పట్టు సాధించి జనాధన్ సర్కార్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ‘మహిళలు లేని విప్లవం గెలవబోదు’ అనే నినాదంతో కొన్నేండ్లుగా మావోయిస్టు పార్టీలో మహిళలను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. అయతే 2005లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడిన సల్వాజుడుంతో పాటు మిజోరాం ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆదివాసీ గ్రామాలపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేయడంతో బాధిత మహిళలు పెద్దసంఖ్యలో ఉద్యమం వైపు మళ్లారు. గతంలో సాయుధ బలగాలు దండకారణ్యం లోకి ప్రవేశించే అవకాశం లేకుండేది. కేవలం బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టుల ఇలాకాలోకి వెళ్లేవారిని టార్గెట్ చేసేవి. ముఖ్యంగా జనధన్ సర్కార్ లోకి వెళ్లే ఆదివాసీలను అడ్డుకుని సాయుధ బలగాలు గతంలో బేస్ క్యాంప్‌ల వద్ద శిబిరాలను ఏర్పాటు చేసి ఆదివాసీలను నిర్బంధించేవారు. అలా రోజుల తరబడి ఆ మహిళలను క్యాంపుల్లో ఉంచుకుని పోలీసులు వారిపై అత్యాచారాలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి.
Also Read : ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
మావోలలో మహిళలే అధికం
2006 జనవరి 11న డాక్టర్ ఇలీనా, అడ్వకేట్ సుధా భరద్వాజ్, జర్నలిస్ట్ వనజతో పాటు రించిన్, సోమా ముఖర్జీ, దేవేంద్ర, శ్రీదేవి, షర్మిలా శంకర్‌లతో కూడిన ఓ కమిటీ ఈ వార్తను బల పరుస్తూ రిపోర్ట్ కూడా అందజేసింది. ఈ నివేదిక ప్రకారం భద్రతా బలగాలు ఆదివాసీ మహిళలను నిర్బంధించడంతోపాటు వారిపై లైంగికవేధింపులకు, అత్యాచారాలకు పాల్పడేవారు. ఈ కారణంగా బేస్ క్యాంపుల్లో ఏకంగా12 మంది బాలికలు గర్భం దాల్చారు. కొంత మందిని మాయం చేశారు. సల్వాజుడుం మనుగడలో ఉన్న కాలంలో 34 మంది మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఆల్ ఇండియా ఉమెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లోనూ తేలింది. ఈ ఆకృత్యాల బరించలేక పెద్దసంఖ్యలో ఆదివాసీ మహిళలు మావోయిస్టుల్లో చేరారు. దండకారణ్యంలో సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉంటే ఇందులో వెయ్యి మందికిపైగా మహిళా మావోయిస్టులే ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ‘క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్’ పేరుతో బస్తర్ ప్రాంతంలో విస్తరించిన మహిళా మావోయిస్టులు పార్టీకి ముందు భాగంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్లలో పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బల కారణంగా మహిళా మావోయిస్టులకు సరైన పోషకాహారం లభించడం లేదన్నది మావోయిస్టు ఉద్యమంలో అనుభవం ఉన్నవారు చెబుతున్న మాట. దీంతో ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు మహిళలే భారీ సంఖ్యలో బలవుతున్నారు.
Also Read : రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
మొత్తం మీద ఆఫరేషన్ కగార్ మొదలయ్యాక 102 మంది మహిళా మావోయిస్టులు నేలకొరిగారు. ఈ నెల 9న బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో 11 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్లలో మహిళా కమాండోస్‌దే కీలకపాత్ర. మహిళా జవాన్లు అబూజ్‌మాఢ్ అడవుల్లో 70 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి కూంబింగ్‌లో పాల్గొంటున్నారు.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
ఈగల్ స్కాడ్
ఒకప్పుడు మైదాన ప్రాంతాలకే పరిమితమైన సాయుధబలగాలు ఇప్పుడు వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. సూర్య కిరణాలు సోకని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలుగుతున్నాయి. అందుకు కారణం ‘ఈగల్ స్కాడ్’ అని పలువురు విశ్రాంత ఐపీఎస్‌లు చెపుతున్న మాట. భారత ఆర్మీ నుంచి తెలంగాణ పోలీసుల వరకు గరుడ దళాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్టే.. ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్’కు కేంద్ర హోంశాఖ ‘గరుడ దళం’ సహకారం తీసుకుంటోంది. సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు, రక్షణ, రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు 2020లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొయినాబాద్‌లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వాటిని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగిస్తోందని పలువురు చెప్తున్నారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు తెలంగాణలో శిక్షణ పొందిన, పొందుతున్న గద్దలను వినియోగించినట్టు విశ్వసనీయ సమాచారం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు. వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్, మెడకు, రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్టు తెలిసింది. వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకొని, పథకం ప్రకారం కాల్పులు జరిపారని పలువురు అంటున్నారు. వానకాలం, చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. పోలీసులు విజయం సాధించడానికి ముఖ్యకారణం గరుడ దళమేనని చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్