Union Budget 2025 : నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో విపక్షాలు రచ్చరచ్చ .. ఎంపీలు వాకౌట్ !

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ ప్రారంభానికి ముందే మహాకుంభామేళా అంశంపై ఎస్పీ ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించారు. విపక్షాల నినాదాల మధ్యే బడ్జెట్ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది.

New Update
nirmalamma

nirmalamma

పార్లమెంట్‌లో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది వరుసగా ఆమెకు ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ   గురజాడ అప్పారావు సూక్తితో నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే  ఈ బడ్జెట్ ప్రారంభానికి ముందే మహాకుంభామేళా అంశంపై ఎస్పీ ఎంపీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించారు. విపక్షాల నినాదాల మధ్యే బడ్జెట్ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది. వికాసిత్ భారత్ లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని నిర్మలా తెలిపారు.   విపక్షాలకు స్పీకర్ నచ్చజెపుతున్నారు. అయిన వినకుండా ఎస్పీ  ఎంపీలు లోక్ సభనుండి వాకౌట్ చేశారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు