NEET UG Re-Exam 2026.. హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ హాల్ టికెట్లను తన వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది.

New Update
neet exam

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ హాల్ టికెట్లను తన వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది. జూన్ 21వ తేదీన జరగబోయే ఈ రీ-టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులందరూ వెంటనే neet.nta.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లి తమ అడ్మిట్ కార్డలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందే వీటిని ప్రింట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏవైనా తప్పులు ఉంటే

ఈ ప్రత్యేక రీ-ఎగ్జామ్ జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఈ హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్, పరీక్ష రాసే సెంటర్ పేరు, అక్కడికి చేరుకోవాల్సిన రిపోర్టింగ్ టైమ్, పరీక్ష తేదీతో పాటు పాటించాల్సిన ముఖ్యమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఒకవేళ మీ హాల్ టికెట్‌లోని వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సరిచేయించుకోవాలి.

మీ అడ్మిట్ కార్డ్‌ను చాలా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన neet.nta.nic.in ఓపెన్ చేయాలి. ఆ హోమ్‌పేజీలో కనిపిస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తెరుచుకునే పేజీలో మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌తో పాటు అక్కడ స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ క్యాప్చా కోడ్‌ను తప్పుల్లేకుండా ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్‌మిట్ చేసిన వెంటనే మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసి దగ్గర పెట్టుకోవాలి. 

Advertisment
తాజా కథనాలు