/rtv/media/media_files/2026/05/01/neet-ug-2026-2026-05-01-15-40-35.jpg)
NEET UG 2026
మే 3వ తేదీన జరగనున్న నీట్ (NEET UG) పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా కేంద్రంలో ఎదురయ్యే బయోమెట్రిక్, డ్రెస్ కోడ్ ఇబ్బందులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చని తెలుపుతూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
బయోమెట్రిక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?
సాధారణంగా కొన్నిసార్లు చెమట, గోరింటాకు లేదా గాయం కారణంగా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అభ్యర్థుల బయోమెట్రిక్ సరిగా పడదు. అందువల్ల ఆ సమయంలో కంగారు పడకుండా కొన్ని మార్గాలను అనుసరించాలి.
ఐరిస్ స్కాన్: బయోమెట్రిక్ మెషీన్ మీ వేలిముద్రను గుర్తించలేకపోతే ఇన్విజిలేటర్ మీ కంటిపాపల ఆధారంగా గుర్తింపును నిర్థారిస్తారు.
మ్యాన్యువల్ వెరిఫికేషన్: ఒకవేళ ఐరిస్ కూడా కాకపోతే మ్యాన్యువల్‌గా అంటే ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుతో అడ్మిట్ కార్డుపై ఉన్న ఫోటోను సరిపోల్చుతారు.
అండర్‌టేకింగ్ ఫామ్: ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అభ్యర్థి నుండి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకుని ఎగ్జామ్‌కు పంపించే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఇలాంటి ఇబ్బందులేవీ రాకుండా ఉండాలంటే చేతులకు రంగులు, మెహందీ, క్రీములు అప్లై చేయకుండా ఉంటే మంచిది.
డ్రెస్ కోడ్ నిబంధనలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. అభ్యర్థుల డ్రెస్ కోడ్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ NTA నిబంధనలు ఉల్లంఘిస్తే పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించే అవకాశం ఉంది.
పురుషులు: హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ లేదా టీషర్ట్స్ మాత్రమే ధరించాలి.
ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ లేదా పెద్ద బటన్స్ ఉన్న బట్టలు వేసుకోకూడదు.
అలాగే షూ కూడా ధరించడం నిషేధం కాబట్టి స్లిప్పర్స్ లేదా శాండిల్స్ మాత్రమే వాడాలి.
మహిళలు: పెద్ద బటన్లు, బ్రోచ్‌లు లేదా పువ్వులు లేని సాధారణ బట్టలు ధరించాలి.
సగం చేతుల కుర్తాలు లేదా టీ-షర్టులు ధరించడం మంచిది.
చెవిపోగులు, ఉంగరాలు, గాజులు, నెక్లెస్‌లు లేదా ఏ రకమైన ఆభరణాలైనా నిషేధం.
హై-హీల్ శాండల్స్ ధరించకూడదు. సాధారణ ఫ్లాట్ స్లిప్పర్లు వాడాలి.
మతపరమైన దుస్తులు:
మత సంప్రదాయం ప్రకారం హిజాబ్ లేదా తలపాగా ధరించి వస్తున్నట్లయితే.. క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి వీలుగా రిపోర్టింగ్ సమయానికి కనీసం ఒక గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. అలాగే నీట్ యూజీ అభ్యర్థులు తమతో పాటు పారదర్శకంగా ఉన్న వాటర్ బాటిల్‌ను తీసుకురావచ్చు.
Follow Us