Mumbai : పట్టాలు తప్పిన మరో రైలు.. 24 గంటల వ్యవధిలో మూడో ప్రమాదం..!

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం మరువక ముందే మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ జిల్లాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఇప్పుడు మరో రైలు ప్రమాదానికి గురైంది. ముంబైలో లోకల్ ట్రైన్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి.

New Update
Mumbai local train

ఈ మధ్య రైలు ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. ఒకటి జరిగిన తర్వాత మరొకటి వరుసగా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్‌గా తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది విషయం అందరికీ తెలిసిందే. భాగమతి ఎక్స్ ప్రెస్‌ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే స్టేషన్‌ దగ్గర గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది.

శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్‌లో దాదాపు 1,360 మంది ప్రయాణికులు ఉన్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ టీ ప్రభుశంకర్‌ పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారని.. వారిలో 4గుకి తీవ్రంగా గాయాలయ్యాయని అన్నారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

Also Read :  ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

24 గంటల్లో రెండవ రైలు ప్రమాదం

ఇక ఇది మరువక ముందే మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ జిల్లాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు ఎగసిపడ్డాయి. కురుక్షేత్ర - ఖజురహో మధ్య నడిచే ఈ రైలులో మంటలు చెలరేగాయి. ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ దూరంలో ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం 24 గంటల్లో రెండవది. 

Also Read : Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

24 గంటల్లో మూడవ రైలు ప్రమాదం

ఇక ఇది కూడా మరువక ముందే మరో రైలు ప్రమాదం కలకలం రేపింది. ముంబైలో లోకల్ ట్రైన్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అక్టోబర్ 13 మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్‌కి చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో వెస్ట్ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తున్న క్రమంలో ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన 2 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. 

Also Read :  మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!

Also Read :  లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు