పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది వరుసగా ఆమెకు ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇప్పుడు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు రుణం పొందవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకువస్తామని తెలిపారు.
బడ్జెట్‌లో రైతుల కోసం ప్రధాన మంత్రి ధనధాన్య యోజనను ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 1.7 కోట్ల మంది రైతులకు సాయం అందుతుంది. పేదలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తానని బడ్జెట్ లో సీతారామన్ అన్నారు. వ్యవసాయ వృద్ధి, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సాధిస్తామని అన్నారు. ఆర్థిక రంగ సంస్కరణలపై కూడా శ్రద్ధ చూపుతామన్నారు. 100 జిల్లాల్లో ధన్ ధాన్య యోజనను ప్రారంభిస్తున్నారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది.