/rtv/media/media_files/2025/03/08/jX9RhYclQhTtTqtV0fIL.jpg)
మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది. కోమాలో ఉన్న ఓ పేషెంట్ బెడ్ పై నుంచి లేచొచ్చి డాక్టర్లకు చుక్కలు చూపించాడు. తనకు చికిత్స చేయడానికి వైద్యులు లక్ష రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నించారంటూ రోడ్డు బయటకు నగ్నంగా వచ్చి హాల్ చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
In a private hospital in Madhya Pradesh, a patient was tied up, and the family was extorted for money by falsely claiming that he had fallen into a coma. 🙏#Oscars#ChampionsTrophy2025#ViratKohli
— 𝘼𝙢𝙞𝙩 (@AmitYji127) March 5, 2025
pic.twitter.com/7LQKnhIp7j
ఇంతకు ఏం జరిగిందంటే
బంటీ నిమామా అనే ఆ వ్యక్తి స్థానికంగా ఓ గొడవలో గాయపడగా అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఓ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మొరుగైన చికిత్స కోసం జీడీ అనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బంటి కోమాలోకి వెళ్లాడని అతని భార్యకు చెప్పిన డాక్టర్లు చికిత్సకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చే సమయంలో రూ. 40 వేలు చెల్లించామని అతని భార్య చెబుతోంది. అయితే మరింత డబ్బుకోసం సొంతూరికి వెళ్లగా.. అక్కడి నుంచి వచ్చేసరికి తన భర్త అర్ధనగ్నంగా ఆసుపత్రి ముందు అరుస్తూ కనిపించాడని తెలిపింది. కోమాలో ఉన్న తన భర్త బయట ఇలా కనిపించడంతో షాక్ అయ్యానని బంటి భార్య చెప్పుకొచ్చింది. తన భర్త కోమాలో ఉన్నాడని తనను డాక్టర్లు నమ్మించారని బంటి భార్య ఆరోపిస్తుంది.
ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే మేము ఇప్పటికే రూ. 40 వేలు ఖర్చు చేశామని వెల్లడించింది. అయితే వారి ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. పేషెంట్ నుండి రూ. 8వేలు మాత్రమే తీసుకున్నామని వెల్లడించింది. అదనపు డబ్బు డిమాండ్ చేశామన్న ఆరోపణలను కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) డాక్టర్ ఎంఎస్ సాగర్ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
Also read : ఆ ఆరుగురు ఎలా చనిపోయారు.. వివేక హత్య కేసులో అంతుచిక్కని విషయాలివే!