/rtv/media/media_files/2026/06/09/dating-2026-06-09-21-03-17.jpg)
మనదేశంలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ, కొన్ని కోరికలను మాత్రం బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారు ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంచేందుకు సీక్రెట్ డేటింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 4.5 కోట్ల మంది ఇండియన్స్ ఇలాంటి యాప్స్‌ను ఉపయోగించగా, కేవలం పోయిన ఏడాది ఒక్కట్లోనే 1.6 కోట్ల మంది కొత్తగా వీటిల్లో చేరారు.
ఇవి మనం సాధారణంగా చూసే టిండర్, బంబుల్ లాంటి యాప్స్ లాంటివి కావు. ఈ యాప్స్ తమను తాము ఎలా ప్రచారం చేసుకుంటాయంటే.. "మీ పేరు, ముఖం చూపించకుండా డేటింగ్ చేయొచ్చు. పెళ్లి బంధాన్ని దాటి కొత్త పరిచయాలు పెంచుకోవచ్చు. రహస్యంగా కలవచ్చు అని చెబుతాయి. ఈ యాప్స్ వాడుతున్న వారిలో చాలా మంది పెళ్లయిన వారే ఉండటం గమనార్హం. కొందరు పెళ్లయిన దంపతులు మూడో భాగస్వామి కోసం, మరికొందరు గే డేటింగ్ కోసం వీటిని వాడుతున్నారు. తమ వైవాహిక జీవితంలో సంతోషంగా లేమని, అందుకే ఇక్కడికి వచ్చామని కొంతమంది ఓపెన్‌గా చెప్పారు.
ఈ యాప్స్ అన్నీ ఉచితంగా ఏమీ సేవలు అందించవు. మీ ప్రొఫైల్‌ను ఎవరో లైక్ చేశారని చూపిస్తాయి కానీ, ఆ వ్యక్తి ఎవరో చూడాలన్నా, వారితో మాట్లాడాలన్నా డబ్బులు కట్టి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని అడుగుతాయి. అయితే చాలా మంది వినియోగదారులు డబ్బులు కట్టినా కూడా యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదని, నకిలీ ప్రొఫైల్స్ చూపిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ, తమకు నచ్చిన భాగస్వామి ఇక్కడ దొరుకుతారనే నమ్మకంతో జనాలు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
వెరిఫై చేయడం తప్పనిసరి
టిండర్ లాంటి పాపులర్ యాప్స్‌లో ఒరిజినల్ ఫోటోలు, ముఖాన్ని వెరిఫై చేయడం తప్పనిసరి. అందుకే అక్కడ నకిలీ అకౌంట్లు పెట్టి దాక్కోవడం కష్టం. కానీ, ఈ సీక్రెట్ యాప్స్‌లో ఎలాంటి గుర్తింపు కార్డులు, ఒరిజినల్ ఫోటోలు అవసరం లేదు. ఎవరికీ తెలియకుండా చాలా ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. అందుకే చాలా మంది వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం టిండర్, బంబుల్ యాప్స్ డౌన్‌లోడ్స్ తగ్గుతుంటే.. ఈ సీక్రెట్ యాప్స్ డౌన్‌లోడ్స్ మాత్రం బాగా పెరుగుతున్నాయి.
మొత్తానికి డేటింగ్ అంటే కేవలం పెళ్లికాని వారు ప్రేమ కోసం వెతుక్కునేది అనే రోజులు పోయి.. ఇప్పుడు పెళ్లయిన వారు కూడా రహస్యంగా తమ కోరికల కోసం ఇలాంటి యాప్స్ వైపు వెళ్తుండటం ఒక పెద్ద మార్పుగా కనిపిస్తోంది.
Follow Us