BIG BREAKING :  ఘోరం.. రెండు బస్సులు ఢీ... ఏడుగురు మృతి!

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఘోరం జరిగింది.  మహారాష్ట్రకు చెందిన రెండు ప్రభుత్వ బస్సులు అత్యంత ఘోరమైన ప్రమాదానికి గురయ్యాయి. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 7 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
surat

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఘోరం జరిగింది.  మహారాష్ట్రకు చెందిన రెండు ప్రభుత్వ బస్సులు అత్యంత ఘోరమైన ప్రమాదానికి గురయ్యాయి. ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 7 మంది ప్రాణాలు కోల్పోయారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇంతకు ఏం జరిగిందంటే 

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న బార్డోలి తాలూకా మానేక్‌పూర్ ఉవా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు బస్సులు మహారాష్ట్ర రాష్ట్ర రవాణా సంస్థకు చెందినవి. వాటిలో ఒక బస్సు ధులే నుండి సూరత్ వైపు వెళ్తుండగా, మరొక బస్సు గుజరాత్ నుండి మహారాష్ట్ర వైపు వస్తోంది. ప్రయాణంలో ఉండగా హఠాత్తుగా ఒక బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, ఆ బస్సు డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లి రోడ్డుపై బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రెండో బస్సు దీన్ని బలంగా ఢీకొట్టి పక్కకు దూసుకెళ్లిపోయింది.

ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే బోల్తా పడిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. బస్సులో భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ తాపీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అదే దారిలో వెళ్తున్నారు. బస్సు తగలబడుతుండటం చూసిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులను, ఫైర్ బ్రిగేడ్ సిబ్బందిని,  అత్యవసర రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి దిగడంతో సహాయక చర్యలు చాలా వేగంగా ప్రారంభమయ్యాయి. గాయపడిన ప్రయాణికులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisment
తాజా కథనాలు