Monalisa Father : నా బిడ్డను వాడు ట్రాప్ చేశారు..  మోనాలీసా తండ్రి సంచలనం!

కుంభమేళా బ్యూటీ మోనాలీసా భోంస్లే పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన మోనాలీసా, కేరళలో ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది.

New Update
monalisa

కుంభమేళా బ్యూటీ మోనాలీసా భోంస్లే పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన మోనాలీసా, కేరళలో ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలోని నైనార్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే, తన కుమార్తెను మోసగించి లవ్ జిహాద్ కు గురిచేశారని ఆమె తండ్రి జైసింగ్ భోంస్లే ఆరోపిస్తున్నారు. తన బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకురావాలని ఆయన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌ను వేడుకున్నారు.

మాయమాటలతో ట్రాప్

మోనాలీసా తండ్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె సినిమాల్లో నటించాలనే కోరికతో ట్రైనింగ్ తీసుకుంటోందని, ఈ క్రమంలో ఫర్మాన్ ఖాన్ ఆమెను మాయమాటలతో ట్రాప్ చేశాడని ఆయన ఆరోపిస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, హిందూ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు కూడా ఆమెను తిరిగి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ప్రకటించాయి. తన మేనత్త కొడుకుతో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారని, కానీ మోనాలీసా దానికి అంగీకరించకుండా కేరళకు పారిపోయిందని తెలుస్తోంది.

ఇష్టపూర్వకంగానే మోనాలీసా పెళ్లి

మరోవైపు, ఈ ఆరోపణలన్నింటినీ మోనాలీసా పూర్తిగా తోసిపుచ్చారు. తిరువనంతపురంలో మీడియా ముందుకు వచ్చిన ఆమె తన పెళ్లి తన  ఇష్టపూర్వకంగానే జరిగిందని స్పష్టం చేశారు. అసలు ఫర్మాన్ ఖాన్‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తానే బలవంతం చేసి ఒప్పించానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం ఎవరూ మతం మార్చుకోలేదని, తమ బంధం పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉందని ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉండటంతో పోలీసుల రక్షణ కోరి మరీ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తండ్రి ఇది మోసమని వాదిస్తుంటే, మరోవైపు మోనాలీసా ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛ అని చెబుతున్నారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు