Union Budget 2025 : ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తాం : నిర్మలా సీతారామన్

ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.  విద్యార్థుల సంఖ్యను పెంచడానికి IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.  పాట్నాలోని ఐఐటీని విస్తరణ చేస్తామన్నారు.  

New Update
nirmalamma

nirmalamma

పార్లమెంట్‌లో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది వరుసగా ఆమెకు ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా తీసుకుస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.  ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.  విద్యార్థుల సంఖ్యను పెంచడానికి IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.  ఐఐటీ పాట్నా విస్తరణ చేస్తామన్నారు.  

ఇక గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా తీసుకుస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ తెలిపారు. గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని..  ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు చేస్తామన్నారు.  పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన కల్పిస్తామని తెలిపారు.  దీనివలన కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని  నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంచారు.  రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. దీంతో  7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు