![Budget 2025 Live](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/01/budget-2025-live.jpeg)
సీనియర్ సిటిజన్లకు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ డిడక్షన్‌ను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచినట్లుగా ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ అద్దెపై వార్షిక పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పెరుగుదల టీడీఎస్ కు లోబడి లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న పన్ను చెల్లింపుదారులు ఉపశమనం పొందుతున్నారు. ఇక ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచుతన్నట్లుగా తెలిపారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్ రిటర్నులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాల పరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.