జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జైల్లో ఉన్న లారెన్స్ కోసం తమ కుటుంబం ఏడాదికి రూ.40లక్షలు ఖర్చు చేస్తోందని అన్నారు. వారికి స్వగ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉండేదని చెప్పుకొచ్చారు.

New Update
lawrence bishnoi

లారెన్స్ బిష్ణోయ్.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఇటీవలే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో బిష్ణోయ్ పేరు మరింత సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో స్నేహంగా ఉండటంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ బాబా సిద్ధిఖీని హత్య చేసింది. ఈ విషయాన్ని స్వయంగా బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

అన్నీ లారెన్స్ కనుసైగలోనే

కాగా లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ యంగ్ గ్యాంగ్‌స్టర్ జైల్లో ఉన్నప్పటికీ తన గ్యాంగ్ బయట వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ కుర్ర మాఫియా డాన్ అనుకున్నది అనుకున్నట్లుగా కనుసైగలతో సాధిస్తున్నాడు. బిష్ణోయ్ అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్ణోయ్ (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ ప్రస్తుతం గ్యాంగ్ నడుపుతున్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ ఆసక్తిక విషయాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

జైల్లో రూ.40 లక్షలు ఖర్చు 

లారెన్స్ బిష్ణోయ్ కోసం తమ కుటుంబం ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తోందని అన్నారు. అయితే లారెన్స్ ఎప్పుడూ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని అనుకోలేదని చెప్పుకొచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పూర్తి చేశాడని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ముందు నుంచి తమది సంపన్న కుటుంబం అని అన్నారు. లారెన్స్ తండ్రి హరియాణా పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

దాదాపు 110 ఎకరాల భూమి ఉండేది

వారికి స్వగ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉండేదని.. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన వస్తువులే వాడేవాడని చెప్పారు. ఇప్పుడు కూడా జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌కి తమ కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

ఇదిలా ఉంటే లారెన్స్ బిష్ణోయ్ బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్ కాగా.. స్కూల్లో చదువుతున్న సమయంలో అతడి పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. అయితే డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో ప్రత్యర్థి వర్గం అతడి ప్రియురాలిని సజీవ దహనం చేయడంతో.. అతడు పూర్తిగా నేరాల వైపుకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు