VD Satheesan: కేరళం కొత్త CMగా VD సతీశన్.. పోరాటమే ఆయన జీవితం.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ ఇదే!

సతీశన్ రాజకీయ ప్రస్థానం ఆయన స్కూల్, కాలేజీ రోజుల్లోనే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన KSU (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

New Update
kera la new cm

కేరళ సీఎంగా వీడీ సతీషన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ తదితరుల మధ్య జరిగిన సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ విషయాన్ని తెలియజేశారు.   కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం  వీడీ సతీశన్  వైపు మొగ్గు చూపింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత కేరళకు సీఎం ఖరారయ్యారు. 

వీడీ సతీషన్ ఎవరంటే ?  

1964  మే 31వ తేదీన  ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కె. దామోదర మీనన్, వి. విలాసిని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్ హార్ట్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేశారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశారు. రాజకీయంలోకి పూర్తిస్థాయిలో రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య ఆర్. లక్ష్మీప్రియ, వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది.

సతీశన్ రాజకీయ ప్రస్థానం ఆయన స్కూల్, కాలేజీ రోజుల్లోనే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన KSU (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1996లో మొదటిసారి పరవూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి లెఫ్ట్ (CPI) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుండి నేర్చుకుని, 2001 ఎన్నికల్లో అదే స్థానం నుండి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి ఇప్పటివరకు (2001, 2006, 2011, 2016, 2021,  2026 ఎన్నికల్లో) వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్ వేవ్ ఉన్నప్పుడు కూడా ఆయన తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

2021 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, రమేష్ చెన్నితల స్థానంలో హైకమాండ్ సతీశన్‌ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై అవినీతి, పాలనా వైఫల్యాలపై అసెంబ్లీలో ఆయన చేసిన పదునైన వాదనలు, పోరాటాలే 2026లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమయ్యాయి.

ఆయన కేరళ అసెంబ్లీలో ఎల్లప్పుడూ సబ్జెక్ట్, పక్కా ఆధారాలతో మాట్లాడే  బెస్ట్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి గానూ ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. వివాద రహితుడిగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా పార్టీలోనే కాకుండా కేరళ ప్రజల్లోనూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఆ ఇమేజే నేడు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతోంది. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీడీ సతీశన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం  ఆస్తుల విలువ సుమారు రూ.6.65 కోట్లు. ఆయన పేరు మీద సుమారు రూ. 41.45 లక్షల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కాగా  తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.  యూడీఎఫ్ 140 స్థానాలకు గాను 102 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)  కేవలం 35 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 

Advertisment
తాజా కథనాలు