SOS To Centre: ఏ క్షణమైనా ఇండియాలో విమానాలు బంద్!

ఆకాశంలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది.

New Update
Indigo

ఆకాశంలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది. పరిస్థితి ఇలాగే ఉంటే విమానాలను నడపడం అసాధ్యమని, ఆపరేషన్లు పూర్తిగా ఆపేయాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి పెద్ద కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విమానయాన రంగం ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి.

అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ మేఘాలు, గొడవల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా ఒక విమానం గాల్లోకి లేవాలంటే అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 40 శాతం కేవలం ఆ విమాన ఇంధనం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ధరలు భరించలేనంతగా పెరిగిపోవడంతో సంస్థల దగ్గర డబ్బులు సరిపోవడం లేదు. దీనికి తోడు కొన్ని దేశాల మీదుగా విమానాలు వెళ్లకూడదనే ఆంక్షల వల్ల, చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో ఖర్చు మరింత తడిసి మోపెడవుతోంది.

విమానయాన శాఖకు లేఖ

ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు విమానయాన సంస్థల సమాఖ్య (FIA) కేంద్ర పౌర విమానయాన శాఖకు ఒక లేఖ రాసింది. ఇంధన ధరలను నిర్ణయించే పద్ధతిని మార్చాలని, దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఒకే రకమైన ధరలు ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. సరైన సమయంలో ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోకపోతే, విమానాలు నడపడం లాభసాటి కాదని, ఫలితంగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు హెచ్చరించారు. ఈ మేరకు ఏప్రిల్ 26న ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

కాగా విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో టికెట్ ధరలను పెంచేశాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి ఒక్కో టికెట్‌పై దాదాపు రూ. 300 నుండి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లే విమానాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యూరప్ లేదా అమెరికా వంటి దేశాలకు వెళ్లే రూట్లలో ఇంధన చార్జీల రూపంలోనే వేల రూపాయలు అదనంగా భారమవుతోంది.

విమాన ఇంధనంపై ఉన్న పన్నులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అందుకే టికెట్ రేట్లు పెంచడం కంటే, ప్రభుత్వం ఇంధన ధరలనే తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్నాయి.  

Advertisment
తాజా కథనాలు