పోలీసులకు రైల్వే షాక్.. టికెట్ లేకుంటే భారీ జరిమానా! టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారని, ఇకపై టికెట్ లేని వారందరికీ జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 23 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 17:47 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Railway: టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకునేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. మరో రెండు వారాల్లో దసరా పండుగ సీజన్ మొదలుకానుండగా.. టికెట్ లేని, అనధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి 15, అక్టోబరు 25 నుంచి నవంబరు 10 వరకు 17 జోన్ల జనరల్ మేనేజర్లకు ఇందుకు సంబంధించిన విధివిధానాలపై రైల్వేశాఖ లేఖలు పంపించింది. ఏసీ కోచ్ లలో వందలాది మంది పోలీసులు.. ఈ మేరకు తనిఖీల నివేదికలను నవంబరు 18 నాటికి పంపించాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు చెప్పారు. ఇటీవల గాజియాబాద్- కాన్పుర్ సెక్షన్లో తనిఖీలు చేపట్టగా.. వివిధ రైళ్లలోని ఏసీ కోచ్ లలో వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీఐ వివరాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ లేకుండా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2,231 కోట్లు వసూల్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. #ticket #indian-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి