/rtv/media/media_files/2026/02/06/agni-3-2026-02-06-20-45-06.jpg)
ఇండియన్ డిఫెన్స్ రంగంలో మరో మైలురాయి నమోదైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. శుక్రవారం (ఫిబ్రవరి 6) స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో అగ్ని-3 క్షిపణి భారత్‌కు అత్యంత కీలకమైన ఆయుధంగా మారుతుంది. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలను, రక్షణ దళాలను ప్రభుత్వం అభినందించింది.
AGNI 3 IRBM successfully test fired ☀️
— ghatak (@Neetivaan) February 6, 2026
we fxcking ball 🥵 pic.twitter.com/kD8AJWknIc
అగ్ని-3 క్షిపణి 3,000 నుండి 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఇది సుమారు 1.5 టన్నుల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. రెండు అంచెల సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్‌తో పనిచేసే ఈ క్షిపణి, అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సైనిక దళాల శిక్షణలో భాగంగా నిర్వహించిన ఈ ప్రయోగం, క్షిపణి పనితీరును, వ్యవస్థల సంసిద్ధతను మరోసారి ధృవీకరించింది.
BREAKING | Intermediate Range Ballistic Missile ‘Agni-3’ successfully test-fired
— FOX-BET (@PratyaksaA) February 6, 2026
Intermediate Range Ballistic Missile ‘Agni-3’ was successfully test-fired from the Integrated Test Range, Chandipur, Odisha on February 06, 2026. The launch validated all operational and technical… pic.twitter.com/1kRhPIzJ5R
అగ్ని-3 క్షిపణి ఇప్పటికే భారత సైన్యంలో చేర్చబడింది. ఈ తాజా ప్రయోగం దేశం కనీస అణు నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసింది. క్షిపణి ప్రయోగ సమయంలో రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్ ద్వారా దాని గమనాన్ని నిరంతరం పర్యవేక్షించారు. అన్ని రకాల ప్రమాణాలను అందుకుంటూ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకుందని డీఆర్డీవో, రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
Follow Us