/rtv/media/media_files/2026/02/28/train-toilet-update-21-2026-02-28-15-49-59.jpg)
మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా అనేక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైలు టికెట్ బుకింగ్స్, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ, మెసేజింగ్ యాప్స్ వంటి వాటిపై పలు మార్పులు రాబోతున్నాయి. ఇవి సాధారణ ప్రజల ఆర్థిక, డిజిటల్ లావాదేవీలపై ప్రభావం చూపేలా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ప్రజల భద్రతను పెంచడానికి అలాగే సైబర్ మోసాలను అరికట్టడానికి, మరిన్ని సేవలను మెరుగుపరచడానికి ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
రైలు టికెట్ బుకింగ్స్
ఇండియన్ రైల్వేస్ డిజిటల్ సేవలో కీలక మార్పులు తీసుకువచ్చాయి. మార్చి 1 (రేపటి) నుంచి పాత UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తోంది. దీని ప్లేస్‌లో ‘RailOne’ అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మార్చి 1 నుంచి ఈ యాప్ ద్వారానే రైల్వే సేవలు జరగనున్నాయి.
ఇప్పటి వరకు జనరల్ టికెట్స్ కోసం యూటీఎస్, రిజర్వేషన్ టికెట్స్ కోసం IRCTC వంటి రకరకాల యాప్‌లను ఉపయోగించేవారు. కానీ ఇకపై RailOne యాప్ ద్వారానే జనరల్, రిజర్వేషన్, ప్లాట్ ఫామ్ వంటి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. పాత యూటీఎస్ / IRCTC యాప్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతోనే ఇందులో లాగిన్ అవ్వొచ్చు.
LPG సిలిండర్ ధర
LPG సిలిండర్ ధరలు ప్రతీ నెలా మారుతూ ఉంటాయి. దానికి అనుగునంగానే మార్చి 1 నుంచి గృహ, వాణిజ్య LPG సిలిండర్లకు కొత్త రేట్లు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ రేట్లు ముడి చమురు ధరలను బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
SIM బైండింగ్ అవసరం
మార్చి 1 నుంచి సిమ్ కార్డులు, మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి ఫోన్‌లోని యాక్టివ్ సిమ్ కార్డుకు లింక్ చేయాలి. ఒకవేళ సిమ్‌కు లింక్ చేయకపోతే ఆ యాప్స్‌ను ఉపయోగించలేరు. అంటే దీనర్థం.. ఏ ఫోన్ నెంబర్‌తో అయితే వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లు ఉపయోగిస్తున్నారో ఆ ఫోన్‌లో తప్పనిసరిగా యాక్టివ్ సిమ్‌కార్డు ఉండాలి. ఒకవేళ మీరు వెబ్/డెస్క్‌టాప్ వినియోగదారులైతే ప్రతీ 6 గంటలకు ఒకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం.. డిజిటల్ మోసాలు, ఫేక్ అకౌంట్‌లను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.
కనీస బ్యాలెన్స్ నిబంధనలో మార్పు
మార్చి 1 నుంచి బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో కూడా పలు మార్పులు రాబోతున్నాయి. కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరాలను మార్చవచ్చు లేదా పొదుపు ఖాతా నియమాలను అప్డేట్ చేయవచ్చు. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ ప్రక్రియ మరింత స్పీడ్ కానుంది. గతంలో నెలకు ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియ జరిగేది. కానీ ఈ కొత్త నిబంధనతో ఇప్పుడు వారానికి ఒకసారి అప్డేట్ జరిగుతుంది. దీనివల్ల లోన్స్ తీసుకునేవారికి అప్రూవల్స్ ఈజీ అవుతుంది.
దీంతోపాటు యూపీఐ ట్రాన్సక్షన్ల విషయంలో మోసాలను అరికట్టేందుకు మరిన్ని భద్రతా ఫీచర్లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక క్రెడిట్ కార్డుల విషయానికొస్తే.. రివార్డ్ పాయింట్స్, గడువు, వార్షిక ఛార్జీలు, వినియోగంపై బ్యాంకులు కొత్త పాలసీలను అమలు చేసే అవకాశం ఉంది.
CNG, PNG ధరలు
మార్చి 1 నుంచి వాహనాలకు ఉపయోగించే CNG, అలాగే పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే PNG ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వీటి ధరలు పెరిగితే.. కారు, ఆటో డ్రైవర్ల ఇంధన ఖర్చులు భారం కానున్నాయి. అలాగే PNG ధరలు పెరిగితే సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడనుంది.
Follow Us