Lockdown : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

ఇండియాలోకి HMPV అనే వైరస్ ఎంటర్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. దీంతో ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ పెడతారా అన్న చర్చ మొదలైంది.

New Update
lockdown

lockdown Photograph: (lockdown)

చైనా దేశాన్ని ఇప్పుడు హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్(HMPV)అనే వైరస్ అతలాకుతలం చేస్తుంది.  ఈ వైరస్ కారణంగా చైనాలో చోట్ల హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి.  అయితే ఈ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదంటూ  కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసి 24 గంటలు గడవకముందే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏకంగా రెండు కేసులు నమోదయ్యాయి.  బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. 

హెచ్‌ఎంపీవీ కేసులు ఇండియాలో నమోదు కావడం అందరిని షాక్ కు గురిచేసింది.  ఇద్దరు చిన్నారుల్లో HMPV లక్షణాలు నిర్ధారణ అయినప్పటికీ పిల్లలు మాత్రం  దేశం దాటిన హిస్టరీ లేదు. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా విదేశాలకు వెళ్లింది లేదు. అయినప్పటికీ   వైరస్ ఎలా సోకిందనే విషయంపై కేంద్రం తల పట్టుకుంటుంది.   వైరస్‌ ఎలా సోకిందో తేల్చే పనిలో పడ్దారు ICMR అధికారులు.  ఈ ఇద్దరికే సోకిందా లేదా ఇంకా దేశంలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.  

కొత్త రకం వైరస్ హడల్

ఐదేళ్ల క్రితం వచ్చిన కరోనాతో దేశంలో చాలా మంది చనిపోయారు.  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు ఈ కొత్త రకం వైరస్ హడల్ పుట్టిస్తుంది.  ఏ నలుగురు కలిసిన ఇప్పుడు ఈ వైరస్ గురించే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు దేశంలో రెండు కేసులు కూడా నమోదు కావడంతో దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడుతారా అన్న సందేహం అందరిలో మొదలవుతుంది. కేసులు పెరిగితే మన దేశంలో లాక్‌డౌన్ రావడం పక్కా అంటున్నారు. మొత్తానికి ఈ వైరస్ భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  

Also Read :  కన్నప్ప నుంచి అదిరే అప్డేట్.. పార్వతీ దేవిగా కాజల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు