Gold Prices Hike : భారీగా పెరిగిన పసిడి ధరలు...ఈసారి ఎంత పెరిగిందంటే?

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్త అనిశ్చితుల కారణంగా దేశీయంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గురువారం (మే 14) మార్కెట్ కొంత స్థిరంగా సాగుతున్నప్పటికీ, ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

New Update
gold

Gold Prices Hike

Gold Prices Hike : అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్త అనిశ్చితుల కారణంగా దేశీయంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బుధవారం ఉదయం ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.14,000 పెరిగి అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచడం కూడా ఈ అకస్మాత్తు పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. నిన్నటి భారీ ఒడిదుడుకుల తర్వాత, గురువారం (మే 14) మార్కెట్ కొంత స్థిరంగా సాగుతున్నప్పటికీ, ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు ఉదయం 10.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరిగి రూ.1,62,330కు చేరుకుంది. అలాగే, ఆర్నమెంట్ బంగారం అయిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.300 మేర పెరిగి రూ.1,48,800 (మరోచోట రూ.1,48,880) వద్ద ట్రేడ్ అవుతోంది. నగరంలో కిలో వెండి ధర స్వల్ప మార్పులతో రూ.3,20,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహాలో బంగారం ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,260గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,950 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,62,330గా, 22 క్యారెట్ల ధర రూ.1,48,800గా నమోదైంది. ఇక అన్ని నగరాల కంటే చెన్నైలో పసిడి ధరలు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,180కు పెరగ్గా, 22 క్యారెట్ల ధర రూ.1,50,500కు చేరింది.

బంగారం ధరలు ఇలా రికార్డు స్థాయిలో దూసుకుపోతుంటే, వెండి ధరల్లో మాత్రం దేశవ్యాప్తంగా భారీ పతనం కనిపించింది. కిలో వెండి ధర ఏకంగా పది వేల రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం చెన్నైలో గరిష్ఠంగా కిలో వెండి ధర రూ.3.15 లక్షలు పలుకుతుండగా, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో రూ.3 లక్షల మార్కు వద్ద కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు