తిరుపతి లడ్డూ కల్తీ చేయడం పాపం.. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆందోళన!

తిరుపతి లడ్డూ కల్తీ మహా పాపమని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భక్తులు తిరుపతి లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తారన్నారు. ఇలాంటి లడ్డూను కల్తీ చేశారన్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదంలో కల్తీ ఘటనలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
ramnath kovind

తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వస్తున్న వార్తలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు ప్రసాదం మీద నమ్మకం ఉందన్నారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకోవడం కుదరలేదని, కానీ ఆలయానికి వెళ్లిన వారు ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారన్నారు. అప్పుడే తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతోందనే ఆరోపణలు గుర్తు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ మహా పాపమని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.  కేవలం తిరుపతి ఆలయం విషయంలో మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆలయాల్లో కూడా ఇలాంటి సమస్యే ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్త చేశారు. భక్తులు ప్రసాదాన్ని ఎంతో నమ్ముతారని.. అలాంటి లడ్డూని ఇలా కల్తీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసాదంలో కల్తీ జరిగిందని తేలితే.. దీనిని అరికట్టేందుకు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి

లడ్డూ వివాదంపై బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో విచారణ జరిపించి, కఠినంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే సీబీఐకి అప్పగించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. హిందువుల నమ్మకాన్ని దెబ్బ తీసిన ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు