/rtv/media/media_files/2026/06/02/foreigners-2026-06-02-14-31-16.jpg)
ఇండియాలో తమ వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర ప్రభుత్వం రూల్స్ మార్చింది. కేంద్ర హోం శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. విదేశీయులు ఇకపై ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 180 రోజులు లేదా అంతకంటే తక్కువ టైమ్ ఉండే వీసాల మీద ఇండియాకు వచ్చేవాళ్లు, ఆ 180 రోజుల గడువు ముగిసిపోక ముందే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాత రూల్స్ ప్రకారం అయితే.. ఇండియాకు వచ్చిన 180 రోజుల తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరో 14 రోజుల టైమ్ ఉండేది. కానీ ఇప్పుడు తెచ్చిన మార్పుల ప్రకారం.. ఆ 180 రోజుల టైమ్ అయిపోక ముందే ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. ఇండియాలో ఉంటున్న విదేశీయుల వివరాలను సరిగ్గా పర్యవేక్షించడం కోసం, ఇమ్మిగ్రేషన్ నిఘాను మరింత బలోపేతం చేయడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎక్కువ రోజులు ఉండే వీసా ఉండి కూడా.. ఒకేసారి 180 రోజుల కంటే ఎక్కువ రోజులు ఇండియాలో ఉండకూడదనే రూల్ ఉన్న విదేశీయులకు కూడా ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. అలాంటి వాళ్లు ఒకే ఏడాదిలో 180 రోజుల కంటే ఎక్కువ కాలం ఇక్కడే ఉండాలి అనుకుంటే.. గడువు ముగిసేలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాదు, ఇలా ఎక్కువ రోజులు ఉండటానికి పర్మిషన్ కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇస్తామని, ఊరికే పర్మిషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
పాత రూల్స్ ప్రకారం
తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ విదేశీయులైనప్పుడు.. వారికి ఇండియాలో పుట్టే పిల్లల విషయంలో కేంద్రం ఒక మంచి ఉపశమనం కలిగించింది. పాత రూల్స్ ప్రకారం.. కొత్త వీసా గానీ, దేశం దాటి వెళ్లడానికి ఎగ్జిట్ పర్మిట్ గానీ కావాలంటే, పాప లేదా బాబు పుట్టిన 30 రోజుల్లోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు తెచ్చిన కొత్త రూల్ ప్రకారం.. తల్లిదండ్రుల్లో ఒకరు గనుక ఇండియన్ అయ్యుండి, ఆ బిడ్డకు భారతీయ పౌరసత్వమే ఉంచాలి అనుకుంటే, ఇకపై పుట్టిన వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ బిడ్డ ఇండియాలో ఉంటున్నప్పుడే ఏదైనా వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే మాత్రం.. అలా తీసుకున్న 30 రోజుల్లోపు తల్లిదండ్రులు అధికారులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి.
విదేశీయులకు వైద్యం అందిస్తూ, తమ దగ్గరే బెడ్స్ లేదా బస సదుపాయం కల్పించే పెద్ద పెద్ద హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లు అధికారులకు ఇచ్చే రిపోర్టింగ్ విధానంలో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ వల్ల హాస్పిటల్స్ చేసే పనిలో పెద్ద మార్పులేమీ ఉండకపోయినప్పటికీ.. విదేశీ రోగులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించే నిబంధనలను మాత్రం మరింత అప్‌డేట్ చేశారు.
Follow Us