/rtv/media/media_files/2025/01/20/zC5U2srSdtNTlmRyKqRI.jpg)
Principal & Lady Teacher Photograph: (Principal & Lady Teacher)
రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామ కోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు ఏకంగా పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా గంగ్రార్ బ్లాక్‌లోని సలేరా గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్, మహిళా ఉపాధ్యాయురాలు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఆఫీసు రూమ్ లోనే ముద్దులు పెట్టుకోవడంతో పాటుగా అంతకుమించిన పనులను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది.
The CCTV video of Salera school in Chittorgarh went viral, in which a teacher and a female teacher are doing obscene acts.
— Deepak Kumar (@DeepakK36550352) January 19, 2025
The teacher and the female teacher got into a romantic mood in the school itself.
When the District Magistrate came to know about this news, both these… pic.twitter.com/PXv439sY56
ఇద్దరిని సస్పెండ్
సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ గా మారడంతో ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు. వీడియో దృశ్యాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ శర్మ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ చేసేందుకు విద్యాశాఖ ముగ్గురు గెజిటెడ్ అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఐదు రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది.
चित्तौड़गढ़
— Education Nagari (@educationnagari) January 19, 2025
अश्लीलता फैलाने वाले दोनों शिक्षकों को किया गया निलंबित#EducationNagari pic.twitter.com/6HdvGtsTqZ
ఈ ఘటనపై గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని, మరి ఇంత బరితెగిస్తారా అని మండిపడుతున్నారు.
Also Read : Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!