Chhattisgarh: నకిలీ ఎస్బీఐ బ్రాంచ్..లక్షల మోసం ఇంతకంటే మోసం మరొకటి ఉండదు. బ్యాంకులంటేనే భరోసా...అలాంటి బ్యాంకులే నకిలీవి అయితే...ఇంకేం చేయాలి. ఛత్తీస్‌ఘడ్‌లో ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసి...గ్రామస్థుల చేత ఖాతాలు తెరిపించి డబ్బులతో ఉడాయించారు . By Manogna alamuru 05 Oct 2024 | నవీకరించబడింది పై 05 Oct 2024 20:13 IST in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Fake SBI: ఛత్తీస్‌గఢ్‌లో విస్తుపోయే బ్యాంకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ బ్రాంచ్‌లో.. అచ్చం అసలైన బ్యాంక్ లాగానే కొత్త ఫర్నీచర్, బ్యాంక్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నకిలీ శాఖ అని తెలియక గ్రామస్థులు ఇందులో ఖాతాలు తెరచి అడ్డంగా మోసపోయారు.ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌కు విషయం తెలిసి, గత నెల 27న ఈ బ్రాంచ్‌పై విచారణ చేయడంతో అసలు మోసం బయటపడింది. ఈ బ్రాంచ్‌లో ఉద్యోగం పొందినవారికి ఇచ్చిన ఆఫర్ లెటర్లు కూడా అచ్చం నిజమైన వాటిలాగే ఉన్నాయి. ఈ నకిలీ శాఖలో ఉద్యోగాలను రూ.2 నుంచి రూ.6 లక్షల ధరకు అమ్మినట్టు బాధితులు వాపోయారు. Also Read: హర్యానా,జమ్మూ–కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి