/rtv/media/media_files/2025/04/02/PKC39vZLlnoJwOKqvevp.jpg)
muda scam case Photograph: (muda scam case)
ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల స్కామ్‌లో దర్యాప్తు చేసిన లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లోకాయుక్తా పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈడీ 8 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికలో ఆయన నిర్దోషి అని తప్పుగా పేర్కొన్నారని వాదిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది ED. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఇతరులపై పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) April 2, 2025
Karnataka High Court allows ED to probe MUDA case involving CM @siddaramaiah
ED had earlier filed a petition in the Special Court of People's Representatives to quash the Lokayukta report on #MUDA which had given Siddaramaiah a clean chit pic.twitter.com/Hze4eKVT78
ED పిటిషన్‌ను ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తోంది. లోకాయుక్త నివేదికను అంగీకరించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక హైకోర్టు గతంలో ED సమన్లను రద్దు చేసింది. కానీ ఇప్పుడు దర్యాప్తు కోసం ఒత్తిడి మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో మైసూరులోని విజయనగర ప్రాంతంలో 14 ప్లాట్లను ముడా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కేసరే గ్రామంలో పార్వతి యాజమాన్యంలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుందనే ఆరోపణపై ED దర్యాప్తు చేస్తోంది. ఈ కేసునే ముడా స్కామ్‌గా కొనసాగుతుంది. ఈడీ విచారణలో సిద్ధరామయ్య తప్పు చేశారని వెల్లడైంది. కానీ 2025 ఫిబ్రవరిలో లోకయుక్త పోలీసులు ఆయన కుటుంబం నిర్థోషి అని క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ విషయంపై ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల స్పెషల్ కోర్టుకు వెళ్లింది.