Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

New Update
Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్మాణ స్థలంలో జరిగిన ఈ ఘటనలో చనిపోయినవారిలో ఓ వైద్యుడు, ఐదుగురు భవన నిర్మాణ కూలీలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ముష్కరుల కాల్పుల్లో మరికొందరు గాయపడినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

సొరంగ నిర్మాణం..

స్థానికేతర కార్మికులపై జరిగిన ఈ దాడి హేయమైందని, పిరికిపంద చర్య అని మండిపడ్డారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీనగర్‌లోకి ఓ ఆసుపత్రికి తరలించాలని ఒమర్‌ సూచించారు. గుండ్ ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన నిర్మాణ కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ ప్రాంతంలో సొరంగ నిర్మాణం జరుగుతోందని అధికారులు చెప్పారు.

Also Read: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్)‌లో పోస్ట్ చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు ‘గండేర్బల్‌లోని గగంగీర్‌లో ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు చేపట్టాయి. తదుపరి వివరాలను వెల్లడిస్తాం అని తెలిపారు. ఉగ్రదాడిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. 

Also Read:  పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!

అమాయక కార్మికులు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నారని అన్నారు. ‘అమరులైన కార్మికులకు నివాళులర్పిస్తున్నాను.. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’ అని గడ్కరీ ట్వీట్ చేశారు.

Also Read: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా?

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరిగి.. గతవారమే ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అక్టోబరు 16న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే ఉగ్రదాడి జరగడం గమనార్హం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు