/rtv/media/media_files/2026/05/07/vijay-2026-05-07-06-32-14.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ AIADMK పంపిన ప్రతిపాదనను DMK ఘాటుగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రజలు తమకు ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పు ఇచ్చారని, ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తమకు ఆసక్తి లేదని DMK నాయకత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని AIADMK ఇప్పటికే ప్రకటించింది. TVK అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరగా, మే 5వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా 16వ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. దీనితో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
చిన్న పార్టీలు ససేమిరా
ఇప్పటికే TVK 108 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 113కు చేరుకుంది. ఇప్పుడు విజయ్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఆయనకు సపోట్ చేయడానికి చిన్న పార్టీలు ససేమిరా అంటున్నాయి. ఇక మరోవైపు మెజార్టీ నిరూపించుకునేందుకు విజయ్ కు రేపటి వరకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రేపటి వరకు డెడ్ లైన్ విధించారని తెలుస్తోంది. ఆ లోపు మెజార్టీ చూపించకపోతే ఆర్టికల్ 356 ప్రకారం తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారని సమాచారం. మరికొద్ది గంటల్లో విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ను ఎలా సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టకుండా ఉండేందుకు TVK తన 108 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని ఒక రిసార్ట్‌కు తరలించింది.
Follow Us