/rtv/media/media_files/2026/05/04/dmk-2026-05-04-09-45-07.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ప్రదర్శనతో లీడింగ్ లో ఏకంగా 100 స్థానాల మార్కును దాటేసింది. ఉదయం నుంచి సాగుతున్న కౌంటింగ్‌లో టీవీకే అగ్రస్థానంలో దూసుకుపోతుండటంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే రెండో స్థానంలో కొనసాగుతోంది. డీఎంకే వ్యతిరేక ఓటును టీవీకే , ఏఐఏడీఎంకే పంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. అధికార డీఎంకే అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు వెనుకంజలో ఉండటం గమనార్హం. తను పోటీ చేసిన పెరంబూరు. తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లోనూ విజయ్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు.
Follow Us