/rtv/media/media_files/2025/03/20/ZcV2xNtN5aTCZ2wy3MgI.jpg)
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమెది సహాజమరణం కాదని.. తన కూతురి మృతికి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కారణమంటూ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ గురువారం ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కూతుర్ని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని.. దీనిపై విచారణ జరపాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఆదిత్య ఠాక్రేకు నార్కో టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సతీష్ సాలియన్ చేసిన ఆరోపణలపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో బీజేపీ, ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదంతా బీజేపీ చేస్తోన్న కుట్ర అని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి ఆడుతున్న నాటకమని ఆరోపించింది.
ఇంతకు ఏం జరిగిందంటే
2020, జూన్ 9న దిశా సాలియన్ అనుమానాస్పద పరిస్ధితుల్లో మృతి చెందింది. ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ లోని 14వ ఫ్లోర్ నుంచి ఆమె పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అయితే దిశ చనిపోవడానికి ముందు తన లవర్ రోహన్, మరికొంతమందితో కలిసి పార్టీలో పాల్గొంది. ఈ క్రమంలో దిశపై లైంగిక దాడి చేసి చంపారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించిందని కేసును క్లోజ్ చేశారు. అయితే ఆమె చనిపోయిన వారం రోజులకే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవడం పెద్ద సంచనలంగా మారింది. అతని మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరిద్దరి మరణాలకు ఏమైనా లింక్ ఉందా అన్న అనుమానాలు అప్పట్లో నెలకొన్నాయి.
Also Read : Encounter: ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!
Also Read : కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!