తొక్కిసలాట ఘటన..  భార్య, కూతురు మిస్, చనిపోయిన తల్లి.. బాధితుల ఆర్తనాదాలు!

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు కనిపించకుండా పోయారు. సొంతకుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో వారి బాధలు వర్ణాణతీతం  అనే చెప్పాలి.  

New Update
delhi victims

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు కనిపించకుండా పోయారు. సొంతకుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో వారి బాధలు వర్ణాణతీతం  అనే చెప్పాలి.  

భార్య, కూతురు మిస్ 

యోగేష్ మిశ్రా అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని అనుకున్నాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా జరిగిన తొక్కిసలాటలో అతని భార్య, కూతురు మిస్ కాగా కొడుకు మాత్రం తనతోనే ఉన్నాడని ఏడుస్తూ తెలిపాడు. వారు ఎక్కడున్నారో తెలియదని.. తాను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదంటూ వాపోయాడు. ఇక బిమ్లా దేవి అనే ఓ మహిళ తన భర్త కనిపించడం లేదని... ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నాడని  ఏడుస్తూ చెప్పింది. తన భర్తను చివరిసారిగా రాత్రి 10 గంటలకు చూసినట్లుగా వెల్లడించింది. బీహార్ కు చెందిన రాజ్ కుమార్ మాఝీ తన భార్య, కూతురు, కొడుకుతో కలిసి నవాడ జిల్లాకు వెళ్తున్నానని చెప్పాడు. ఈ తొక్కిసలాటలో తన భార్య శాంతి దేవి, కుమార్తె పూజ మరణించారని మాఝి తెలిపాడు. కానీ తన కొడుకు మాత్రం కనిపించడం లేదన్నాడు. 

పాట్నాకు చెందిన పప్పు అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తన తల్లిని కోల్పోయానని వెల్లడించాడు.  ఈ తొక్కిసలాటలో తన కోడలను కోల్పోయిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అకస్మాత్తుగా ఆమె చేయి తన నుంచి జారిపోవడంతో జనం తొక్కిసలాటలో నలిగిపోయి చనిపోయిందని తెలిపింది.  కాగా  లోక్ నాయక్ ఆసుపత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతు సక్సేనా 15 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతుల్లో 11 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో ఇద్దరు మరణించారు. ప్రమాదంపై రైల్వే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఇక ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  కాగా మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read :  రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు