Cyber Crime: ఒక్క అక్షరం మార్చి రూ.10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలుసా?

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసంతో అమాయకుల ఖాతాలకు చిల్లులుపెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ పేరులోని ఒక్క అక్షరాన్ని మార్చిరూ.10 కోట్లు కొట్టేశారు సైబర్‌ కేటుగాళ్లు. జరిగిన మోసం గ్రహించి ఆ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది.

New Update
CYBERCRIME

CYBERCRIME

Cybercrime : దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసంతో అమాయకుల ఖాతాలకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ పేరులోని ఒక్క అక్షరాన్ని మార్చేసి రూ.10 కోట్లు కొట్టేశారు సైబర్‌ కేటుగాళ్లు. జరిగిన మోసం గ్రహించి సదరు కంపెనీ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది.

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. ఇప్పటికే ఈ కేవైసీలు, ఓటీపీల పేరుతో బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా.. మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. మెయిల్స్ లోని అక్షరాలు మార్చి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా ఓ కంపెనీ మెయిల్‌లోని ఒక్క అక్షరాన్ని మార్చి రూ. 10 కోట్లు కొట్టేశారు. అంటే ఒక అక్షరం మార్పు పదికోట్లకు ముంచిందన్నమాట.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!


ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌ నగరంలోనే చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఒక కంపెనీ..హాంకాంగ్‌ నుంచి తమకు కావాల్సిన ముడిసరుకు కొనుగోలు చేస్తుంటుంది. లావాదేవీలు పూర్తిగా ఈమెయిల్‌ ద్వారానే జరుపుతుంది. హాంకాంగ్‌ సంస్థ తరఫున [email protected] ద్వారా హైదరాబాద్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతుంటారు. ఈసారి కూడా ఎప్పటిలాగే ఇటీవల సరుకు డెలివరీ పూర్తయిన తర్వాత ఒకరోజు హైదరాబాద్‌ సంస్థకు మెయిల్‌ వచ్చింది. ఆడిట్‌ కారణాల వల్ల తమ బ్యాంకు అకౌంట్ మార్చామని, తమకు రావాల్సిన బకాయిలు కొత్త బ్యాంకు అకౌంట్‌కు బదిలీ చేయాలని ఆ మెయిల్‌ సారాంశం. అది చూసిన హైదరాబాద్‌ కంపెనీ నిజమేనని నమ్మింది. అనుకున్నట్లే వారు పంపిన కొత్త అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేసింది.

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

తాము చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాం కదా అని ధీమాగా ఉన్న హైదరాబాద్‌ కంపెనీకి వారం తర్వాత మరో మెయిల్‌ వచ్చింది. తమకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించ లేదని హాంకాంగ్‌ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన హైదరాబాద్‌ సంస్థ ఉద్యోగులు వారం క్రితమే తాము డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశామని అందుకు సంబంధించిన వివరాలను వారి మెయిల్‌కు పంపారు. అయితే దాన్ని గుర్తించిన హాంకాంగ్‌ సంస్థ నోరెళ్ల బెట్టింది. మీరు డబ్బులు పంపిన ఆ అకౌంట్ తమది కాదని.. డబ్బు పంపాలనిఈ-మెయిల్‌ కూడా తాము పంపలేదని హాంకాంగ్‌ సంస్థ స్పష్టం చేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన నగర కంపెనీ.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి సైబర్‌ నేరగాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. 

Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!


అయితే హాంకాంగ్‌ సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు ఆ సంస్థ లావాదేవీలను గుర్తించారు. 
హాంకాంగ్‌ సంస్థ సర్వర్‌ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆ సంస్థ జరుపుతున్న లావాదేవీల వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. సరుకు డెలివరీ అయిన తర్వాత అదే సంస్థ నుంచి మెయిల్‌ పంపుతున్నట్లు ఫేక్ మెయిల్‌ ఐడీ సృష్టించి.. తమ బ్యాంకు అకౌంట్ మార్చుతున్నట్లు హైదరాబాద్‌ సంస్థకు మెయిల్ పంపారు. ఇందుకోసం [email protected] కు బదులుగా [email protected] అనే మెయిల్‌ ఐడీని క్రియేట్ చేశారు. రాబర్ట్‌ పేరులో 'o' బదులు 'a'ను చేర్చారు. చూడటానికి రెండింటికీ పెద్దగా తేడా కనిపించదు. శ్రద్ధపెట్టి గమనిస్తే తప్ప అందులో అక్షరాన్ని గుర్తించలేం. అదే వారికి వరంగా మారింది. దీంతో ఆ అక్షరాన్ని గమనించని హైదరాబాద్ సంస్థ సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 కోట్లు పంపింది. అంటే ఒక్క అక్షరాన్ని మార్చి రూ. 10 కోట్లు కొట్టేశారన్నమాట. అందుకే మెయిల్స్, బ్యాంకు ఖాతా నెంబర్లు, ఫోన్ నెంబర్లను ఒకటికి రెండు సార్లు సరిపోల్చుకోవాలని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసు విచారణలో ఉంది.

ఇది కూడా చదవండి: Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు