/rtv/media/media_files/2025/03/03/vBqcclJGeBJvIvckMkGr.jpg)
హర్యానాలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. నిన్న రాత్రి పోలీసులు అనుమానంతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన తర్వాత నిందితుడు తాను హిమాని ప్రియుడిగా పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు
ఈ హత్య కేసులో ఇది మొదటి అరెస్టు కాగా నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మార్చి 1న రోహ్‌తక్‌లోని ఒక హైవే సమీపంలో సూట్‌కేస్‌లో హిమాని నర్వాల్ మృతదేహం లభ్యమైంది. ఆమె మెడలో స్కార్ఫ్ చుట్టుకుని ఉండగా.. చేతులకు మెహందీ కూడా ఉంది. పార్టీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు. హిమాని నర్వాల్ గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు . సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని... అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని తెలిపారు.
బాధితురాలి తల్లి షాకింగ్ ఆరోపణలు
కాగా బాధితురాలి తల్లి సవిత కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. హిమానీ కాంగ్రెస్ కోసం పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదని, తప్పొప్పుల విషయంలో ఆమె కాంప్రమైజ్ అయ్యేది కాదన్నారు సవిత. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు. హిమాని నర్వాల్ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్త. పార్టీలోని ప్రతి ప్రధాన కార్యక్రమంలో ఆమె పాల్గొనేది. హిమాని కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త అని స్థానిక ఎమ్మెల్యే బిబి బాత్రా అన్నారు.
Also Read : అందరూ చూస్తుండగానే అతడిని ముద్దు పెట్టుకుంది.. ఇది రెండో సారి!!