CJP : పేపర్ లీక్‌లపై యుద్ధం :  కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ సంచలన నిర్ణయం!

 కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.

New Update
cjp

 కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, విద్యార్థులు, మద్దతుదారులందరూ ఢిల్లీలో జరిగే శాంతియుత నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్, సీబీఎస్‌ఈ, సీయూఈటీ వంటి ప్రధాన పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ విద్యా వ్యవస్థ లోపాలకు, లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనకు ఎవరో ఒకరు బాధ్యత వహించాలని, అందుకే ఆన్‌లైన్‌లో తాము చేపట్టిన సంతకాల సేకరణకు లక్షలాది మంది మద్దతు లభించిందని చెప్పారు. జూన్ 6, శనివారం ఉదయం తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటానని, మద్దతుదారులంతా అక్కడికి రావాలని కోరారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రదర్శన చేసుకోవడానికి అనుమతి కోరతామని స్పష్టం చేశారు.

అడుగుపెట్టగానే పోలీసులు అదుపులోకి

తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారని అభిజీత్ తెలిపారు. అయితే తనకు భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. "నేను గాంధీ, అంబేడ్కర్, భగత్ సింగ్, నెహ్రూల సిద్ధాంతాలను గౌరవిస్తాను. జైలుకు వెళ్తామనే భయంతో ఇంకెన్నాళ్లు బతుకుతాం? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం మన హక్కు" అని తేల్చి చెప్పారు. తానే గనుక అనుకుంటే విదేశాల్లో మంచి ఉద్యోగం చేసుకునేవాడినని, కానీ దేశం మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం తిరిగి వస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు.

ఇది దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య ఉద్యమం. సుప్రీంకోర్టు విచారణల సందర్భంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా.. నిరుద్యోగ యువతను బొద్దింకలు గా అభివర్ణిస్తూ ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభిజీత్ డిజైన్ చేశారు. చూస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి ఏకంగా 22 మిలియన్లకు పైగా (2 కోట్లు) ఫాలోవర్లు చేరారు. సెలబ్రిటీలు సైతం ఈ పేజీని ఫాలో అవుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు