One Nation_ One Election : ఈ సారే… ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ఒకే దేశం – ఒకే ఎన్నికలు బీజేపీ ఎన్నికల హామీ, దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ రెడీ అవుతుంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

author-image
By Bhavana
New Update
elections

One Nation- One Election : ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి వచ్చింది ఒకే దేశం – ఒకే ఎన్నికలు బీజేపీ ఎన్నికల హామీ, దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ రెడీ అవుతుంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 

ఎర్రకోట నుండి జమిలి ఎన్నికల...

ప్రధాని మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఈ నివేదిక వెలువడనుంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుండి జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ఏటా ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే సారి ఎన్నికలు...

దీని నుండి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారం అని తెలిపారు. ఈ విధానానికి అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయ్యింది. తొలి దశల్లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని మార్చిలో ప్రతిపాదన వచ్చింది. వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, దేశ వ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించాలని కమిటీ తెలిపింది.

Also Read: Jogi Ramesh: జోగి ఇంటి ముందు అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు