/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెషన్-1 ఫలితాలను బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఇప్పుడు తమ మార్కులను బోర్డు వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా
విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ఎస్ఎంఎస్ (SMS), ఐవీఆర్ఎస్ (IVRS) సేవల ద్వారా కూడా విద్యార్థులు తమ మార్కులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
Follow Us