Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించిన కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తోపాటు మొట్టమొదట ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని సీబీఐ అరెస్టు చేసింది.

New Update
RG Kar Ex Principal

RG Kar Ex Principal: కోలకత్తా ట్రైనీ ఆక్టర్ రేప్, హత్య కేసులో ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే పోలీసులు చేశారు. విచారణ కూడా చేస్తున్నారు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను నాశనం చేయడం లాంటి విషయాల్లో సందీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇతనిపై అత్యాచారం, హత్య అభియోగాలను కూడా చేర్చి సీబీఐ అరెస్ట్ చేసింది. వీటన్నింటితో పాటూ కాలేజీలో ఆర్ధిక అవకతవకలకు సందీప్ పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇతనితో పాటూ ట్రైనీ డాక్టర్ కేసును మొట్టమొద దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మతా బెనర్జీతో డాక్టర్ల చర్చలు విఫలమైన కొద్దిసేపటికి ఈ పరిణామం చోటుచేసుకుంది. 

ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైన తర్వాత విచారణలో కీలక నిందితుడు సంజయ్ రాయ్ సీసీటీవీలో కనిపించాడు. సీబీఐ ఇప్పటికే సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ ఈ కేసును స్వాధీనం చేసుకుంది. సంయ్ రాయ్, సందీప్ ఘోష్‌లకు పాలీ గ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి కోర్టు అనుమతినిచ్చినప్పటికీ నిందితలిద్దరూ అనుమతి ఇవ్వకపోవడంతో అది సాధ్యం కాలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

పశ్చిమ బెంగాల్‌లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.

author-image
By K Mohan
New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో తీవ్ర అసంతృ‌ప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిజెపిని ప్రశంసించి తగిన ఒక సాహసోపేతమైన చర్య.

ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో హింసా కాండ మొదలైంది. అక్కడ హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణాలను దోచుకున్నారు. మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపులు అల్లర్లు చెలరేగడంతో సంఘాలు పారిపోవాల్సి వచ్చింది. అల్లర్లు లేపి రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంస చేయడం, నిప్పంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన ప్రాంతం నుంచి భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి చర్యలు ఉగ్రవాదం అదుపు లేకుండా విజృంభిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని బిజెపి విమర్శించింది. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్ , ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ వంటి సీనియర్ రాష్ట్ర బిజెపి నాయకులు టిఎంసి మౌనాన్ని విమర్శించారు. హిందువులను వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టేటప్పుడు టిఎంసి కళ్ళు మూసుకుందని ఆరోపించారు.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ముర్షిదాబాద్‌లో అత్యంత దారుణమైన హింస జరిగినప్పటికీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూర్ వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో, నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులతో జనాలు ఘర్షణ పడ్డారు. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎన్ని నిరసనలు వస్తున్నా వక్ఫ్ చట్టం విషయంలో వెనక్కి తగ్గేతే లేదని తేల్చి చెప్పింది. బిజెపి నాయకుడు తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు, మైనారిటీ సంతృప్తి కోసం ఆమె హిందువుల భద్రత తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల మరణాలపై ఆమె మౌనాన్ని ఆయన ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment