/rtv/media/media_files/2026/02/24/canada-pm-2026-02-24-14-33-06.jpg)
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ఈ హత్య ఇండియానే చేయించిందని అనేక సార్లు ఆరోపించింది. ఇలా మాట మాట పెరిగి కెనడా, ఇండియా మధ్య రిలేషన్స్ చెడిపోయాయి. వాటిని పునరుద్ధరించే దిశగా కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వారం (ఫిబ్రవరి 26, 2026) భారత్‌లో పర్యటించనున్నారు. జస్టిన్ ట్రూడో హయాంలో తలెత్తిన ఉద్రిక్తతలను పక్కన పెట్టి, ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని "రీసెట్" చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. జస్టిన్ ట్రూడో తర్వాత బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ, అమెరికాపై అతిగా ఆధారపడకుండా తన వాణిజ్యాన్ని వైవిధ్యం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే భారత్‌ను ఒక బలమైన భాగస్వామిగా ఆయన చూస్తున్నారు.
Canadian PM Mark Carney is set to visit India from February 26 to March 7, 2026, marking a major reset in the relationship between the two nations. 🇮🇳🤝🇨🇦
— All India Radio News (@airnewsalerts) February 24, 2026
🔗 Full story:https://t.co/2pNqK6iLdmpic.twitter.com/0obfrwhrDo
ఇరు దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న కీలక ఒప్పందాలివే
1. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)
గతంలో నిలిచిపోయిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (CEPA) చర్చలను ఈ పర్యటనలో వేగవంతం చేయనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $70 బిలియన్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కార్నీ తన పర్యటనను ముంబైలో ప్రారంభించి వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు.
2. ఇంధన రంగం - యురేనియం ఒప్పందం
భారతదేశ అణుశక్తి అవసరాల కోసం కెనడా నుండి యురేనియం సరఫరా చేసే విషయంలో 10 ఏళ్ల కాలపరిమితితో కూడిన నూతన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అలాగే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సహకారంపై చర్చలు జరగనున్నాయి.
3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & టెక్నాలజీ
సాంకేతిక రంగంలో నూతన భాగస్వామ్యాలు, ముఖ్యంగా AI పరిశోధనలు, సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో కీలక ఒప్పందాలు జరిగే సూచనలు ఉన్నాయి.
4. రక్షణ- భద్రత
ఖలిస్థానీ అనుకూల శక్తులపై నిఘా మరియు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకరించుకోవడానికి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడంపై కూడా చర్చలు జరుగుతాయి.
5. నైపుణ్యం మరియు సంస్కృతి
భారతీయ విద్యార్థులు, నిపుణుల వీసా ప్రక్రియను సులభతరం చేయడం, "టాలెంట్ మొబిలిటీ" పెంచడంపై దృష్టి సారించనున్నారు.
Follow Us