Flights: ఎయిర్ ఇండియాతో పాటూ మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపు

ఈరోజు పలు విమానాలకు వచ్చిన నకిలీ బాంబుల బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ నుంచి షికాగో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటూ నాలుగు డొమెస్టిక్ విమానాలకూ ఇవే బెదిరింపులు వచ్చాయి. 

author-image
By Manogna alamuru
New Update
DGCA: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

Bomb Threatning: 

ఢిల్లీ విమానాశ్రయం ఈరోజు కాసేపు గందరగోళంగా తయారయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఫ్లైట్లకు వరుసగా బాంబుల బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు నాలుగు డొమెస్టిక్ విమానాలకు బాంబులు ఉన్నాయంటూ మెసేజ్‌లు వచ్చాయి.దీంతో పాటూ జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్, సిలిగురి-బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానాలకు ఎక్స్‌లో ఇలాంటి మెసేజ్‌లే వచ్చాయి.దీంతో వీటిని కాఏపు దగ్గరల్ఓని ఎయిర్‌‌ పోటర్‌‌లో ల్యాండ్ చేశారు అక్కడ తనిఖీలు చేసిన తర్వాత మళ్ళీ వాటిని గమ్యస్థానాలకు చేర్చారు. 

Also Read: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..!

ఇవి కాకుండా  సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇండిగో విమానానికి కూడా ఇదే బాంబు బెదిరింపు రావడంతో దీన్ని  జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో భద్రతా అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నకిలీ బాంబు బెదిరింపులుగా కొట్టిపారేశారు. అలాగే ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న నాన్ స్టాప్ ఎయిరిండియా ఫ్లైట్‌కి బాంబు ఉందనే బెదిరింపులు రావడంతో విమానాన్ని కెనడాలోని ఒక మారుమూల ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అంతకుముందు సోమవారం కూడా ఇదే తరహాలో ముంబై నుంచి వచ్చే మూడు విమానాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పని చేసిన నిందితుల కోసం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ  సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు పోలీసుల సంయుక్తంగా వెతుకుతున్నారు.

Also Read: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు