/rtv/media/media_files/2026/02/20/fotojet-26-2026-02-20-21-18-27.jpg)
fire accident in petrol bunk
Fire accident : పెట్రోల్ బంకులో సిగరేట్ కాల్చవద్దన్నందుకు బైక్ పెట్రోల్ ట్యాంకులోకి లైటర్ విసిరాడు ఓ ప్రభుద్ధుడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ నిర్వహకులు మంటలను ఆర్పి వేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన సంఘటన వైరల్‌గా మారింది.
छत्तीसगढ़ में एक शख्स को पेट्रोल पंप पर सिगरेट पीनें से मना किया ,तो उसने आग लगा दी ,
— Rinku kashyap (@kashyaprinku001) February 20, 2026
अभी उसे गिरफ्तार कर लिया गया है pic.twitter.com/XwQOcPQso2
వివరాల ప్రకారం..ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోయించుకోవడానికి బంకు వద్దకు వచ్చారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పెట్రోల్ పోయిస్తుండగా వెనుక ఉన్న వ్యక్తి దిగి సిగరెట్ కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే సిగరెట్ కాల్చవద్దని బైక్ నడుపుతున్న వ్యక్తి తో పాటు పెట్రోల్ బంకు సిబ్బంది కోరారు. అయితే ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్ నింపుతున్న బైక్ ట్యాంకులోకి లైటర్ విసిరాడు. దీంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 18న రాత్రి 7:40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
రాయ్‌పూర్‌లోని ఉర్లా ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్దఈ ఘటన చోటు చేసుకుంది.కాగా మంటలు ఎగిసి పడగానే పెట్రోల్ బంకు ఉద్యోగి, బైక్‌పై ఉన్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి పరుగెత్తారు. అదే సమయంలో పెట్రోల్ బంకు ఉద్యోగి అప్రమత్తమయ్యాడు. అక్కడ ఇంధనం సరఫరా నిలిపివేశాడు. పక్కనే ఉన్న అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. అదే సమయంలో అక్కడి నుంచి పారిపోతున్న ఆ ఇద్దరు వ్యక్తులను బంకు సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఇద్దరు వ్యక్తులను ధర్మేంద్ర సింగ్, ఇమ్రాన్ ఖురైషిగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి బైక్‌ను, లైటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Follow Us