Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇద్దరు కూతుళ్లను మార్చి యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వటలేదని ఓ వ్యక్తి హేబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఇద్దరు మహిళలు స్వచ్ఛందంగా ఉంటున్నారని తీర్పు వెలువరించింది. By Kusuma 18 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Isha Foundation: సద్గురు జగ్జీ వాసుదేవ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇద్దరు కూతుళ్ల మనస్సును మార్చి, ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదని ఇటీవల ఓ వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విషయంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈషా యోగా సెంటర్‌లో ఇద్దరు మహిళలు వారికి నచ్చే ఉంటున్నారని పోలీసులు విచారణలో తేలింది. అన్ని వివరాలను న్యాయస్థానానికి సమర్పించగా.. ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది కూడా చూడండి: Talking: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు బ్రెయిన్ వాష్ చేశారని.. తమిళనాడులోని కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈషా ఫౌండేషన్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. 42, 39 ఏళ్లు ఉన్న తన ఇద్దరు కూతుళ్ల బ్రెయిన్‌ను వాష్ చేసి అసలు యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వటం లేదని కోర్టులో పిటిషన్ వేశాడు. సద్గురు మాత్రం తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంపన్నమైన జీవితం అందించారు. మిగతా వారి కూతుళ్లకు సన్యాసం తీసుకోవాలిని ప్రోత్సహిస్తున్నారని ఆ ప్రొఫెసర్ ఆరోపించారు. ఇది కూడా చూడండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? ఈ కేసుపై మద్రాసు హైకోర్టు విచారణ జరపగా.. ఇద్దరు మహిళలు హాజరయ్యారు. ఎవరూ బ్రెయిన్ వాష్ చేయలేదని, తమ ఇష్ట ప్రకారమే యోగా సెంటర్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల విషయాలను కూడా తయారు చేసి ఓ నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఫౌండేషన్‌పై ఎన్నో క్రిమినల్ ఫిర్యాదులు ఉన్నాయి. ఇది కూడా చూడండి: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది కాబట్టి ఇంకా లోతుగా విచారించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దీని కోసం ఈషా ఫౌండేషన్‌కు మద్రాసు హైకోర్టు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా ఒక 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేశారు. ఆ ఇద్దరు మహిళల వాంగ్మూలాన్ని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ హేబియస్ కార్పస్ కేసులో ఇంకా చర్యలు తీసుకోకుడదని పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చూడండి: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఆ కారణంతోనే ఎలిమినేట్ కానున్నారా? #isha-foundation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి